శోభిత.. గూడచారి గర్ల్ ఫ్రెండ్!

0అర్థం తెలిసినా.. తెలియకపోయినా.. తెలుసని భ్రమల్లో ఉన్నా కొన్ని పదాలు మాత్రం వినసొంపుగా ఉంటాయి.. అలాంటి కాంప్లికేటెడ్ తెలుగు పదాల్లో ‘ప్రేమ’ ఒకటి. ప్రేమతో పాటు ప్రేమికురాలు..అదేనండీ ‘లవర్’ కూడా కాస్త క్లిష్టమైన పదమే.. అది తెలియాలంటే ‘లవర్’ ఉండాలనేది బేసిక్ కామన్ సెన్స్. మీకుందో లేదో తర్వాత సంగతి కానీ మన టాలీవుడ్ ‘గూడచారి’ కి మాత్రం మంచి బ్యూటిఫుల్ లవర్ ఉంది.

ఆ ‘గూడచారి’ అడివి శేష్.. అయన లవర్ శోభిత ధూళిపాళ. ‘గూడచారి’ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకని ‘గూడచారి’ టీమ్ సినిమాలో ని ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్యనే ‘గూడచారి’ లో కీలక పాత్ర పోషిస్తున్న సుప్రియ యార్లగడ్డ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రా ఏజెంట్ నదియా ఖురేషి పాత్ర పోషిస్తుందని చెప్పారు.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లేడీ లవ్ అఫ్ గూడచారి అంటూ హీరోయిన్ శోభిత ను పరిచయం చేశారు. తను ఈ సినిమాలో సమీర రావు అనే పాత్రలో నటిస్తుందని విలియమ్ అలెన్ కాలేజ్ హార్వర్డ్ యూనివర్సిటీ లో సైకాలజీ మేజర్ చదివిందని తెలిపారు.

శోభిత కు గూడచారి తొలిచిత్రం కావడం విశేషం. మరి ఈ సైకాలజీ దిట్ట ఆ స్పై ని ఎలా తన బుట్టలో పడేస్తుందో.. తన టాలెంట్ తో ఎలా తన చుట్టూ తిప్పుకుందో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.