పెళ్లి చేసుకోబోతున్న సన్యాసిని

0Sofia-Hayat-marriage-Plans‘మార్పు మాత్రమే శాశ్వితం’ అనే వాళ్లు కొందరు కనిపిస్తుంటారు. కాస్త డీప్ గా ఆలోచిస్తే అది నిజమనిపిస్తుంది. ఇంతకు మించి ఈ ఇష్యూలోకి వెళితే ఇదో పెద్ద చర్చగా మారుతుంది కూడా. ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే.. తాజాగా బాలీవుడ్ భామ సోఫియా మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మొన్నటికి మొన్న మోడ్రన్ దుస్తుల్ని వదిలేసి.. తెల్లని బట్టలు వేసుకొని సన్యాసం.. సన్యాసం అంటూ ఆమె నోట వచ్చిన మాటలకు బాలీవుడ్ దాదాపుగా డీప్ షాక్ కు గురైన పరిస్థితి.

అలాంటి సోఫియా ఉన్నట్లుండి ఇప్పుడు మళ్లీ మోడ్రన్ దుస్తులు వేసుకొని.. పెళ్లి.. పెళ్లి అంటూ సోషల్ మీడియాతో తాజాగా మారిన తన లుక్ ను పోస్ట్ చేయటం ఆసక్తికరంగా మారింది. త్వరలో తన పెళ్లి జరగనుందని.. ఈ నెల మూడు.. లేదంటే నాలుగో వారంలో నిఖ్కా పక్కా అనేస్తుంది. ఇంతకీ అమ్మడు పెళ్లి చేసుకునేది ఎవరన్నది తేలనప్పటికీ.. మొన్నటి సన్యాసం ఇప్పుడేమైంది? అన్న ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడితో అమ్మగారి వ్యవహారం పూర్తి కాలేదు. తన పెళ్లి గురించి ఆమె చెప్పిన వివరాలు కూసింత షాకింగ్ గా మారాయి. ఎందుకంటే.. అమ్మడి పెళ్లికి ఆమె బెస్ట్ ఫ్రెండ్ రాఖీ సావంత్ తోపాటు.. బిగ్ బాస్ స్నేహతులు వస్తున్నట్లు చెప్పిన నోటితోనే.. తన పెళ్లికి శివుడు.. బుద్ధుడుతో సహా దేవుళ్లంతా వస్తారని చెప్పింది. తమ పెళ్లిని స్వర్గంలని ఏసుప్రభువు ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్న సోఫియా మాటలు వింటుంటే.. ఎక్కడో ఏదో తేడా కొట్టినట్లుగా అనిపించట్లేదు?

Happily engaged!

A post shared by Sofia Hayat. (Gaia Mother) (@sofiahayat) on