ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్‌ క్లారిటీ!

0Sonakshi-sinha-on-marriage-నటి సోనాక్షి సిన్హా చాలాకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నదట. ప్రియుడు బంటీ సజ్‌దేతో ఆమె రిలేషిన్‌షిప్‌లో ఉన్నదని బాలీవుడ్‌ కోడై కూస్తున్నది. ఈ రూమర్స్‌ తగ్గట్టే ఇటీవల సోనాక్షి-బంటీ కలిసి పార్టీలకు వెళ్లడం, బహిరంగంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకు దొరికిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే సోనాక్షి-బంటీ ఒక ఇంటివారు కాబోతున్నారని, వారి పెళ్లి ఎంతో దూరంలో లేదంటూ కథనాలు కూడా వచ్చేశాయి.

తాజాగా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సుందరాంగి తన పెళ్లి కథనాలపై స్పందించింది. ‘త్వరలోనే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానో నాకు తెలియదు. ప్రజలను మాట్లాడుకోనివ్వండి. వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల పనే అది’ అంటూ ఈ కథనాలను తోసిపుచ్చింది. అయితే, సోనాక్షి-బంటీకి మధ్య విభేదాలు వచ్చాయని, వారు వేరుగా ఉంటున్నారని ఆ మధ్య కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలను ఖండించడానికి అన్నట్టుగా వెంటనే సోనాక్షి-బంటీ కలిసి అనుష్క శర్మ ఫిల్హౌరి స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. అంతేకాకుండా జంటగా డైనింగ్‌ చేస్తూ ఫొటోలు దిగి.. లీక్‌ చేశారు. దీంతో వీరు ప్రేమలో మునిగితేలుతున్నారని బాలీవుడ్‌లో వినిపిస్తోంది.