నాకోసం నేను అందంగా కనిపించాలి కదా!

0బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే క్యానర్ బారిన పడిన సంగతి తెలిసిందే. సోనాలి ప్రస్తుతం అమెరికా లో మెటా స్టాటిక్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటోంది. తనకు క్యాన్సర్ సోకినప్పటి నుండి తరచుగా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ తన ఎమోషన్స్ ను పంచుకుంటున్న సోనాలి తాజాగా ఒక విగ్ పెట్టుకొన్న ఫోటో ను పోస్ట్ చేసింది.

క్యాన్సర్ కు ఇచ్చే కీమోథెరపీ చికిత్స కారణంగా పేషెంట్స్ జుట్టు ఊడిపోతుంది. సోనాలికి కూడా అలానే జరిగింది. ఇప్పటికే గుండుతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన సోనాలి తాజాగా విగ్ పెట్టుకుని ఉన్న ఫోటో ను పోస్ట్ చేసి దాంతో పాటు పెద్ద మెసేజ్ పెట్టింది. “ఎవరికీ అందంగా కనిపించాలని ఉండదు? మనం ఎలా కనిపిస్తామో అన్నది మన మనస్తత్వం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కబాటి అప్పుడప్పుడూ అందంగా కనిపించాలనే తాపత్రయం తప్పేమీ కాదు. అన్నిటికంటే ముఖ్యం మీకేది సంతోషాన్నిస్తుందో అది చేయడం. అది విగ్ పెట్టుకోవడం కావచ్చు ఎర్రటి లిప్ స్టిక్ వేసోకోవడం కావచ్చు.. హై హీల్స్ చెప్పులు వేసుకోవడం కావచ్చు. అవి తప్పని ఎవరూ చెప్పలేరు.”

“నేను విగ్ లు ట్రై చేస్తుంటే నాలో నాకే ఒక డౌట్ వచ్చింది. నేను అందంగా కన్పించాలని మరీ ఇదైపోతున్నానా? గ్లామర్ ఇండస్ట్రీలో నువ్వు తప్పనిసరిగా అందంగా కనిపించాల్సిందే. అదే ఫీలింగ్ తెలియకుండా నాలో కూడా వచ్చిందా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.. అప్పుడు నా మనసుకు అనిపించింది ఏంటంటే.. నాకోసం నేను అందంగా కన్పించాలి. జనాల కోసం కాదని. నాకు గుండులో అలా తిరగాలనిపిస్తే అలా నే స్కార్ఫ్ తో కవర్ చేసుకోకుండా ఫ్రీగా తిరుగుతాను. సో.. మీకేది హ్యాపీ అనిపిస్తే అది చేయండి. ఈ సందర్భంగా నాకు ఒక అమేజింగ్ స్టైలిస్ట్ ను పరిచయం చేసిన ఫ్రెండ్ ప్రియాంక చోప్రా కు ధన్యవాదాలు.”