సోనమ్ భర్త పబ్లిక్ సరసం!

0‘సిగరెట్ తాగనివాడు దున్నపోతై పుట్టున్’ అనేది తెలుగులో ఓ ఫేమస్ డైలాగ్.. అదెక్కడిదో ఇప్పుడవసరం లేదు గానీ ఆ డైలాగ్ ను కొంచెం మారిస్తే ‘పబ్లిక్ గా సరసమాడని వాడు పందై పుట్టున్’ అని మార్చుకోవాల్సినట్టుగా ఉంది. ఎందుకంటారా.. ? సరసాలు.. శృంగారం అనేవి నాలుగు గోడల మధ్యే అనుకుంటే మీరు ‘ఆదిత్య 369’ టైం మిషన్ లో 1950 నుండి డైరెక్ట్ గా 2018 కి వచ్చినట్టే!

ఇప్పుడు సరసాలు పబ్లిక్ గా చేసుకోవడానికే.. ఇంకా మీకేమైనా అనుమానం ఉంటే బాలీవుడ్ నటిమణి సోనమ్ కపూర్ వాళ్ళాయన ఆనంద్ అహుజా గారిని అడగండి. అయన మీకు తీరిగ్గా వివరిస్తాడు. మీకు అయనతో పరిచయం లేకపోతే కనీసం అయన తన భార్యను సరసమాడుతూ ఎత్తుకున్న ఫోటోను చూసినా చాలు. మీకు తత్త్వం బోధపడుతుంది. బాలీవుడ్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుందటే.. అర్థరాత్రి అపరాత్రి లేకుండా ‘నిక్కు’ ఎప్పుడోస్తాడా.. ఆయన చేతిలో ప్రియాంక చెయ్యేసి నడుస్తుందా లేదా అయన ప్రియాంకా నడుం మీద చెయ్యేసి నడుస్తాడా అని ఎదురు చూస్తుంటారు. మరి సోనమ్ – అయన భర్త అహుజా ఇద్దరూ ఓ జోవియల్ మూడ్ లో ఉంటే ఫోటో తీసి పబ్లిష్ చేయకుండా ఉంటారా?

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆనంద్ కొత్త స్టోర్ ఓపెనింగ్ గురువారం నాడు ముంబై లో జరిగింది. సోనమ్ ఆనంద్ ఇద్దరూ అక్కడకు వచ్చారు. వాళ్ళు స్టోర్ వైపు నడుస్తూ ఉండగా ఆనంద్ ను మన్మథుడు బాణం వేసినట్టుగా అయిపోయి తన అందాల సోనమ్ ను అలా ఎత్తుకొని గాల్లోకి లేపాడు.. అంతే. సోనమ్ అలా సిగ్గుపడింది.. ఆ ఫోటో సోషల్ మీడియాలో పడింది!