మొగుడ్ని కవర్ పేజీకి తీసుకెళ్ళింది

0బాలీవుడ్ బ్యూటీ.. నటుడు అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ ఈమధ్యనే పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేసింది. తాను ఎంతో కాలంపాటు ప్రేమించిన ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాతో రీసెంట్ గా ఏడడుగులు నడిచింది. ముంబయిలో గ్రాండ్ గా జరిగిన వీళ్ల వెడ్డింగ్ కు బాలీవుడ్ తారాగణమంతా తరలివచ్చింది.

నిన్న.. మొన్నటి వరకు ఆనంద్ అహూజా అంటే చాలా లిమిటెడ్ పీపుల్ కు మాత్రమే తెలుసు. కానీ సోనమ్ లాంటి టాప్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా తెగ ఫేమస్ అయిపోయాడు. అందుకే వోగ్ మ్యాగజైన్ ఈ జంట పెళ్లి ఫొటోను కవర్ పేజీగా వేసింది. కవర్ పేజీపై ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఈ ఫొటోను ఆనంద్ అహూజానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతోపాటు తన భార్యపై తనకున్న ప్రేమనంతా రంగరించి కామెంట్ కూడా పెట్టాడు. నువ్వు వచ్చాకే నా జీవితం సంపూర్ణమైందంటూ అతడు పెట్టిన కామెంట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

సోనమ్ కపూర్ తాజాగా వీర్ దే వెడ్డింగ్ సినిమాలో నటించింది. నలుగురు అమ్మాయిల కథగా వచ్చిన ఈ సినిమాను చాలా బోల్డ్ గా తీశారు. పెద్ద హీరోలకు పోటీగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఇందులో సోనమ్ తోపాటు కరీనా కపూర్.. స్వర భాస్కర్ – శిక్ష తల్సానియా నటించారు.