రాహుల్ హగ్ పై సోనమ్ ట్వీట్…వైరల్!

0పార్లమెంటులో ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హగ్ ఇవ్వడం….ఆ తర్వాత కన్నుగీటడం…వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు లోక్ సభ సమావేశాల్లో కనిపించని దృశ్యాలు….నేడు రాహుల్ పుణ్యమా అంటూ దర్శనమిచ్చాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రాహుల్ గాంధీ చేసిన పని లోక్ సభ చరిత్రలో నిలిచిపోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ వింక్ కు వింక్ గర్ల్ ప్రియా వారియర్ కూడా ఫిదా అయింది. రాహుల్ వింక్ చాలా స్వీట్ గా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాహుల్ హగ్ & వింక్ పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించారు.

తాజాగా రాహుల్ హగ్ పై బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు స్పందించాడు. `నేడు దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’ జరుపుకోవాలంటూ రాజ్ కుమార్ రావు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ రీట్వీట్ చేసింది. రెండు హగ్ ఎమోటికన్స్ ను సోనమ్ రీ ట్వీట్ చేసింది. అయితే రాహుల్ చేసిన పని చిన్న పిల్లల చేష్టలా ఉందని కొందరు బీజేపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని రాహుల్ కు బాసటగా ట్వీట్ చేశారు. హగ్ చేసుకోవడం మంచిదేనని అందులో తప్పేమీ లేదని దడ్లాని అన్నారు. వాస్తవానికి రాహుల్ హగ్ ను బీజేపీ నేతలు అంగీకరించి…తిరిగి హగ్ చేసుకోవాలని అన్నారు. రాహుల్ హగ్ చేసుకోవడాన్ని నెగెటివ్ గా చూడడం సరికాదని అన్నారు. హగ్ చేసుకోవడానికి ముందు రాహుల్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని తామంతా వాటి కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. రాహుల్ హగ్ పై వీరు చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి.