ఆనందం.. సోనమానందం!

0సోనమ్ కపూర్ బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ తనయగా హిందీ సినిమాల్లో అడుగుపెట్టిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్ల తో పాటు గా ‘నీర్జా’ లాంటి విమర్శకులచే ప్రశంసలు అందుకున్న చిత్రంలో కూడా నటించింది. పోయినేడాది తన బాయ్ ఫ్రెండ్ – ఢిల్లీ కి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకుని Mrs. అహుజా అయింది.

సోనమ్ మొదటి నుంచి సోషల్ మీడియా లో చాలా సోషల్ గా ఉండే హీరోయిన్. హాటు హాటు ఫొటోలతో పాటుగా అపుడప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా తన భర్తతో కలిసి ప్రేమలో మునుగుతూ స్పెషల్ గా తీయించుకున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో – నెటిజనులతో పంచుకుంది. ఆ ఫోటోలలో ఆనంద్ అహుజా నీలం రంగు సూట్ లో ఉండగా.. సోనం డిజైనర్ వేర్ చీరలో తళుక్కున మెరిసింది. భార్య భర్తలిద్దరూ గలే లగ్ జా అన్నట్టుగా ఒకరికి ఒకరు బందీలుగా మారి పప్పీ కి రెడీ అన్నట్టుగా ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన వారు వారిద్దరూ వేరు వేరు కాదని సోనమానందగా ఒకటైపోయారని అనుకుంటే తప్పేమీ లేదు.. అందుకు సోషల్ మీడియా కోర్టులో శిక్షేమీ పడదు.

మరి అందరూ అదే అనుకుంటున్నారేమో గానీ ఈ ఫోటోకు 3.86 లక్షల లైకులు ఫోటో పోస్ట్ చేసిన రెండు గంటల్లో వచ్చాయి. మరి సభ్య సమాజానికి సోనమానంద ఇచ్చే శృంగార సందేశం సరిగ్గా అర్థం అయినట్టే కదా!