మే లో సోనమ్ వివాహం..?

0బాలీవుడ్ లో ఇంతకాలం ప్రేమాయణం తో వార్తల్లో నిలిచిన జంటలు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి బి టౌన్ మీడియా.. త్వరలో కపూర్ ఫ్యామిలీ కి చెందిన సోనమ్ ఓ ఇంటిది కాబోతుందని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కొంత‌కాలంగా ఆనంద్ ఆహుజా అనే యువ‌కుడితో ప్రేమాయణం సాగిస్తున్న సోన‌మ్‌, మే 11 లేదా 12న జెనీవా వేదికగా పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.. ఈ మేరకు ఇరు ఫ్యామిలీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. సోన‌మ్‌, ఆహుజా పెళ్లికి దాదాపు 300 మంది హాజరుకానున్నారని , వీరంద‌రికి ఫ్లైట్ టిక్కెట్స్ కూడా బుక్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. సోన‌మ్ తండ్రి అనీల్ క‌పూర్ ప‌ర్స‌న‌ల్‌గా ఫోన్ చేసి అతిధుల‌ని ఆహ్వానిస్తున్నార‌ట‌. జెనీవాలోనే సంగీత్, మెహందీ సెర్మ‌నీలు ఏర్పాటు చేయ‌నున్నార‌ని స‌మాచారం.