సీమాంధ్రలో పర్యటనకు సోనియా.. ?

0sonia-b-08-11-2012రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైనప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలసి సోనియా పర్యటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అదీ కూడా వరద ప్రభావం ఎక్కువగా వుండే సీమాంధ్రలోకావడం విశేషం.

వరద ముంపు ప్రాంతాలను వీరు ఏరియల్ సర్వే నిర్వహించి..అనంతరం విశాఖలో విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం వున్నట్లు సమాచారం. ఈసందర్భంగా వరదసాయం పేరుతో సీమాంధ్ర రైతులకు భారీ ప్యాకేజీ ప్రకటించేఅవకాశం వున్నట్లు తెలుస్తోంది.

అయితే, అసలు రాష్ట్రాన్ని విభజించారని కాక మీద వున్న సీమాంధ్రనేతలు సోనియా రాకను ఏమేరకు ఆహ్వానిస్తారో వేచి చూడాలి మరి…

Tags : సీమాంధ్రలో పర్యటనకు సోనియా.. ?, Sonia Seemandhra tour, Sonia Flood effected areas tour,