సింధు బయోపిక్.. సోనూ తంటాలు!!

0

బయోపిక్ ల సీజన్ ఇది. ప్రముఖుల జీవితాల్ని వెండితెరకెక్కించడం ద్వారా కాసుల కుంభవృష్టి కురిపించవచ్చని తహతహలాడుతున్నారంతా. బాలీవుడ్ – టాలీవుడ్ – కోలీవుడ్ కాదేదీ బయోపిక్ లకనర్హం అన్న చందంగా చెలరేగిపోతున్నారు. ఎవరైనా ప్రముఖుని జీవితంలో ట్విస్టులు కనిపిస్తే చాలు స్క్రిప్టులు రెడీ అయిపోతున్నాయి. చరిత్రకారుడు – రాజకీయ నాయకుడు – ఫిలింస్టార్ – నేటి తరం ప్రముఖుడు అయినా కథలో కొత్తదనం – ఆకట్టుకునే ఎలిమెంట్సు ఉండాలి అంతే. ఇక క్రీడాకారుల జీవితాలు అందరికీ స్ఫూర్తి నింపేవే కాబట్టి బయోపిక్ తీయడం సులువు అని భావిస్తున్నారు.

ఆ క్రమంలోనే మేరీకోమ్ – ఎంఎస్ ధోని – భాగ్ మిల్కా భాగ్ – సచిన్ – దంగల్ చిత్రాలు క్రీడల నేపథ్యంలో తెరకెక్కి బంపర్ హిట్లు కొట్టాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం క్రికెటర్లు కపిల్ దేవ్ – మిథాలీ రాజ్(లేడీ క్రికెట్ కెప్టెన్) – బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ (శ్రద్ధా నాయిక) జీవితాల్ని వెండితెరకెక్కిస్తున్నారు. సానియా బయోపిక్ పైనా చర్చ సాగుతోంది.

ఇదే ఒరవడిలో పి.వి.సింధు బయోపిక్ పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలే హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు జీవితంపై సినిమా తీస్తానని నటుడు సోనూ సూద్ ప్రకటించారు. స్వీయనిర్మాణంలో తెరకెక్కించే ఈ సినిమా కోసం ఆయనే ప్రస్తుతం స్క్రిప్టు పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 24 డ్రాఫ్టుల స్క్రిప్టును తీర్చిదిద్దారట. పీవీ సింధు 2016లో రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ అందుకున్నప్పటి వరకూ ఎపిసోడ్స్ ని సినిమా తీయాలని తొలుత భావించారు. కానీ ఒలింపిక్స్ మెడల్ గెలుచుకున్న తర్వాత కూడా పీవీ సింధు అజేయమైన జైత్రయాత్ర కొనసాగుతోంది. పలు టోర్నీల్ని గెలుచుకుంది. అందువల్ల స్క్రిప్టును మార్చాల్సి వస్తోందని తెలిసింది. 2020లో ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. త్వరలోనే దర్శకుడెవరన్నది ప్రకటించే ఛాన్సుందిట.
Please Read Disclaimer