ఒక సెట్ – ఇద్దరు డైరెక్టర్లను కెరీర్లో చూడలేదు!

0‘మణికర్ణిక’ సినిమాను మొదలు పెట్టిన సమయం నుండి ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. మొదట్లో ఒక బాలీవుడ్ రైటర్ తను చాలా రోజులు వర్క్ చేసిన స్టోరీని ఈ సినిమాకు కంగనా వాడుకుంటోందని మీడియాకెక్కాడు. ఆ తర్వాత క్రిష్ బయటకు వచ్చాడని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ ను కన్ఫాం చేస్తూ ‘డైరెక్టర్: కంగనా రనౌత్’ అని రాసి ఉన్న క్లాప్ బోర్డు సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. ఇక తాజా గా గా సోను సూద్ సినిమా నుండి బయటకు రావడం మరో వివాదం అయింది.

సోను ‘మణికర్ణిక’ సినిమాకు ఇచ్చిన డేట్స్ అయిపోయాయని తన తాజా చిత్రం ‘సింబా’ కోసం లుక్ మార్చాల్సి వచ్చిందని అందుకే తప్పని సరి పరిస్తితుల్లో ‘మణికర్ణిక’ సినిమా నుండి తప్పుకుంటున్నానని తెలిపాడు. దీనీపై ఫైర్ అయిన కంగన ‘సోనుకు కు లేడి కింద కింద పనిచేయడం ఇషం లేదని.. పురుషాహంకారం’ అని విమర్శించింది. దీనికి రెస్పాన్స్ గా “నేను ఒక సెట్ లో ఇద్దరు డైరెక్టర్ల తో పని చేయలేనని మాత్రమే చెప్పానని నేనెప్పుడు లేడీ డైరెక్టర్ కింద పని చేయనని చెప్పలేదని” అన్నాడు. అంతే కాదు “నేను దాదాపు 80 – 90 సినిమాల్లో నటించాను.. అక్కడంతా ఒక్క డైరెక్టరే” అంటూ పంచ్ ను విసిరాడు. తను గతంలో ఒక లేడీ డైరెక్టర్ తో పని చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాడు.

ఈ సినిమాలో సోను సూద్ సదాశివ్ రావ్ భావూ పాత్రలో నటించాడని సమాచారం. క్రిష్ ‘ఎన్టీఆర్’ సినిమాతో బిజీ కావడంతో ప్యాచ్ వర్క్ ను కంగన డైరెక్ట్ చేస్తోంది. కంగనా ప్యాచ్ వర్క్ ను డైరెక్ట్ చేసినా ఈ సినిమా కు అసలు డైరెక్టర్ మాత్రం క్రిష్ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంతా బాగుంది గానీ సోను ఇద్దరు ఒక సెట్ – ఇద్దరు డైరెక్టర్లు అంటున్నాడు.. దీనర్థం క్రిష్ చెప్పక ముందే “కెమెరా ఫోకస్.. స్టార్ట్ కెమెరా.. కెమెరా రోలింగ్.. యాక్షన్” అని హంగామా చేసిందో ఏమో…! గ్రీకు వీరుడు హృతిక్ కే నిద్ర లేకుండా చేసిన ఘనత ఈ కంగన సొంతం.. మరి క్రిష్ కు కూడా కాస్త తన టాలెంట్ చూపించిందా ఏంటి? పాపం మన క్రిష్ నే ఎందుకు ఈ ముదురు పార్టీలు తగులుకుంటారు?? కాస్త రాహుకాలం.. యమగండం.. లాంటివి చూసి ఈ సారి ముంబై ఫ్లైట్ ఎక్కు క్రిష్ భయ్యా!