పెళ్లికి సిద్ధంగా ఉన్నా శ్రియా

0Shriya-Saranపంతొమ్మిదేళ్ల వయసులోనే ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శరణ్‌.. మరికొద్ది రోజుల్లో 35వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. తన 16 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఉత్థానపతనాలు చవిచూసిన ఆమె.. తాజాగా బాలకృష్ణ సరసన ‘పైసా వసూల్‌’ లో నటించారు. కాగా, తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగులో ‘ఇష్టం’, తమిళంలో ‘ఎనక్కు 20 ఉనక్కు18’ లతో ఎంట్రీ ఇంచ్చి, అనతి కాలంలోనే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘శివాజీ’లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ దక్కించుకున్నారు శ్రియా. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రవితేజ, ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌లు అందరితోనూ తెరపంచుకున్నారు. అటు బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కెరీర్‌ మొత్తంలో మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉందంటే.. సూపర్‌స్టార్‌ రజనీతో కలిసి నటించడమేనని శ్రియా అన్నారు.

‘‘చాలా మంది పెళ్లి ఎప్పుడు? అని అడుగుతుంటారు. అవును.. పెళ్లికి సిద్ధంగా ఉన్నా. నచ్చినవాడు తారాసపడిన వెంటనే వివాహం చేసుకుంటా. స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు చాలా ముఖ్యం కదా. నాకు కాబోయే భర్త మంచి స్నేహితుడై ఉండాలి’’ అని శ్రియా చెప్పారు.