సోఫీ వేడెక్కించే కోణం

0సోఫీ చౌదరి.. పరిచయం అఖ్కర్లేని పేరు ఇది. ఈ అమ్మడు అమెరికా టు ముంబై ఫేజ్3 గాళ్స్ లో బాగా పాపులర్. మోడల్ కం యాంకర్ కం హీరోయిన్ గా – ఐటెమ్ భామగా బాలీవుడ్ కి సుపరిచితం. మహేష్ 1-నేనొక్కడినే చిత్రంలో సోఫీ ఐటెమ్ నంబర్ని మన యూత్ రికగ్నైజ్ చేసింది. అదంతా అటుంచితే సోఫీలో వేరొక కోణం గురించే ఎక్కువగా మాట్లాడాలి. అదే పార్టీ ఫ్రీక్ యాంగిల్.

ముంబై నగరంలో జరిగే సెలబ్రిటీ పార్టీల్లో సోఫీ రెగ్యులర్ ఫేజ్3 ఫ్రీక్ గా పేరు తెచ్చుకుంది. పార్టీల వేళ సోఫీ సందడి – సోఫీ ఫోటోలతోనే అంతర్జాలం హీటెక్కిపోతుంటుంది. అలానే పలు జాతీయ – అంతర్జాతీయ మ్యాగజైన్ల పైనా లెక్కకు మిక్కిలిగా వేడెక్కించే ఫోటోషూట్లతో గతంలో అగ్గిరాజేసింది. ఇదిగో లేటెస్ట్ గా ఫ్యాబ్ లుక్ అనే ప్రముఖ మ్యాగజైన్ కి అంతే వేడెక్కించే ఫోజులిచ్చింది. టాప్ యాంగిల్ నుంచి సోఫీని అదిరిపోయే లెవల్లో ఆవిష్కరించారు ఈ ఫోటోగ్రాఫ్ లో. కవర్ పేజీ అన్నాక ఆమాత్రం లేకపోతే ఎలా? అనుకుందో ఏమో మతిచెడే కోణాన్ని ఎలివేట్ చేసింది సోఫీ. ప్రస్తుతం ఈ ఫోటో యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.