సౌతాఫ్రికా-వెస్టిండీస్‌ మ్యాచ్‌ టై

0కార్డిఫ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా గ్రూప్‌-బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ టైగా ముగిసింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి వరుణుడు పడుతుండటంతో సౌతాఫ్రికా జట్టు 31 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 26.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులతో ఉండగా మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ టై అయినట్లుగా అంపైర్లు ప్రకటించారు.