సినిమాల్లేవ్.. ఏం చేస్తారు మరి?

0South-Heroines-Adjust-for-upcoming-Heroes-For-Movie-Offersఇప్పుడు చాలామంది సీనియర్ స్టార్ హీరోయిన్లు ఒకటే పాట పాడుతున్నారు. ”మాకు కథ నచ్చితే కొత్తోళ్ళతో చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు” అంటూ సాకులు చెబుతూ.. చక్కగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లు తీసుకుంటూ.. మనోళ్ళు చిన్న చిన్న హీరోలతో కూడా నటించేస్తున్నారు. అయితా ఇదంతా నిజంగానే వీరికి సినిమా మీద ఉన్న ప్రేమేనా? అబ్బే కాదంటున్నారు సినిమా లవర్స్.

నిజానికి సీనియర్ స్టారీమణులు అయిన త్రిష.. తమన్నా.. శ్రీయ.. కాజల్.. ఇలా అందరూ ఖాళీగానే ఉన్నారు. అంటే వీళ్ళ చేతిలో పెద్ద హీరోల సినిమాలేవీ లేవు. చేసిన రెండు మూడు సినిమాలు కూడా వీరికి పెద్ద సినిమాలు ఇవ్వలేదు. అందుకే ఆ మధ్యన త్రిష తమిళంలో వయసైపోయిన హీరోలతోనూ కొత్త కుర్రాళ్ళతోనూ సినిమాలు చేసేసింది. అదే ఒకప్పుడైతే కేవలం స్టార్ హీరోలతోనే చేస్తాను అని చెప్పేది. ఇక తమన్నా కూడా సందీప్ కిషన్ తో సినిమా చేస్తోంది. కాజల్ కూడా కళ్యాణ్ రామ్.. రానాలతో సినిమాలు చేస్తోంది. శ్రీయ అయితే చెప్పక్కర్లేదు.. పేమెంట్ ఇస్తే ఏ హీరో అయినా ఓకే. సమంత కూడా చిన్న హీరోలతో చేసేస్తోంది. ఇక్కడ నితిన్ తో చేశాక తమిళంలో శివ కార్తికేయన్ వంటి అప్-కమింగ్ హీరోలతో చేస్తోంది. వీళ్ళందరూ ఎన్ని కథలు చెప్పినా కూడా.. పెద్ద హీరోల సినిమాలు చేతినుండి జారిపోతున్న వేళ.. చక్కగా చిన్న హీరోలతో చేస్తూ లైమ్ లైట్లో ఉంటున్నారనేది వాస్తవం.

ఇకపోతే శృతి హాసన్ వంటి కొంతమంది హీరోయిన్లు మాత్రం.. అసలు మంచి ఆఫర్లను వదిలేసుకుని.. అనవసరమైన సినిమాలు చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. నయనతార మాత్రం చక్కగా చిన్న బడ్జెట్ తో తీసే సినిమాలను ఓకె చేసుకుంటూ.. తను మాత్రం భారీ పారితోషికం తీసుకుంటోంది. అసలు నయన్ సినిమాల్లో హీరోలెవరో సినిమా రిలీజయ్యేవరకు కూడా తెలియట్లేదు. ఇక అనుష్క అయితే వెయిట్ తగ్గేవరకు ఆమె నెక్ట్స్ మూవ్ ఏంటో తెలియదు. సాహో కూడా చేజారిందనేది న్యూస్. ఏదేమైనా చేతిలో సినిమాల్లేకపోతే ఇప్పుడు స్టార్ హీరోయిన్లు చిన్న సినిమాలు కూడా చేయడానికి రెడీ. అది సంగతి.