బాలయ్-ఎన్టీఆర్: అల్ ఈజ్ వెల్?

0కారణాలేవైనా కానివ్వండి గత నాలుగేళ్ళుగా నందమూరి బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య గ్యాప్ ఉంది అని.. ఇద్దరూ కలిసి ఒక వేదిక పంచుకోలేదన్నది జగమెరిగన సత్యం. ఓపెన్ సీక్రెట్ అన్నమాట. బాలయ్య అన్నగారు తారక్ నాన్నగారు అయిన నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం కుటుంబానికి తీరని లోటు అయినప్పటికీ ఆ సంఘటన ఇద్దరి మధ్య గ్యాప్ ను తొలగిపోయేలా చేసిందన్నది లేటెస్ట్ టాక్.

దీంతో నందమూరి బాబాయి – అబ్బాయిల అనుబంధంపై పుకార్లు ఫిలిం నగర్ లో బాగానే వినిపిస్తున్నాయి. అందులో ఒకటేంటంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో తారక్ కు ఒక అతిథి పాత్ర ఇవ్వాలనే యోచనలో బాలయ్య ఉన్నారు అన్నది. ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి కదా. దీంతో ఎన్టీఆర్ ఏ పాత్రలో నటిస్తాడనే విషయం తెలియక పోయినా ఏదో ఒక పాత్ర మాత్రం తప్పని సరిగా ఉంటుందనేది ఒక రూమర్.

ఇక సెప్టెంబర్ 20 న తారక్ తాజా చిత్రం ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కు బాబాయ్ బాలకృష్ణను పిలవాలని తారక్ అలోచిస్తున్నాడని.. ఎలాగూ బాబాయ్ – అబ్బాయిల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి కాబట్టి బాబాయ్ దీవెనలు ఖచ్చితంగా తారక్ కు ఉంటాయని మరో రూమర్. మరి వీటి లో ఏవి నిజాలవుతాయో.. ఏవి రూమర్లుగానే మిగిలిపోతాయి అనే విషయం తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.