మహేష్ కి త్రీ- ఇడియట్స్ కనెక్షన్?

0సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ సినిమాకి బాలీవుడ్ సినిమా `త్రీ- ఇడియట్స్` స్ఫూర్తినిచ్చిందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. మహేష్- నరేష్ మధ్య స్నేహం కాన్సెప్ట్ ఇంచుమించు అలానే ఉంటుందన్న మాటా వినిపిస్తోంది. డీప్ గా వివరాల్లోకి వెళితే..

మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ – మాధవన్ – షర్మాన్ జోషి నటించిన `త్రి ఇడియట్స్` ఎంతటి సంచలనమో తెలిసిందే. యూత్ ఎంతో క్రేజీగా ఈ సినిమాని చూశారు. స్నేహం – ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం కాలేజ్ విద్యార్థుల్ని పదే పదే థియేటర్లకు రప్పించింది. అయితే ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ప్రస్తుత సినిమాకి పోలికలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. మహేష్ 25 చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు – అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. అయితే ఇందులో మహేష్ – అల్లరి నరేష్ స్నేహితులుగా రక్తి కట్టించనున్నారు. ఆ ఇద్దరి మధ్యా ఎమోషనల్ సీన్స్ కట్టి పడేస్తాయిట. మరో కోణంలో చూస్తే – కథ పరంగా గ్రామంలో రైతుల సమస్యలపైనే ఫోకస్ ఎక్కువ. త్రీ ఇడియట్స్ ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేసిన సినిమా. ఆ రెండిటికి మధ్య పోలికలు ఏంటో అర్థంకాని స్థితి. అయితే కొన్ని బాలీవుడ్ సినిమాల స్ఫూర్తి ఉంటుందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. అయితే వంశీ పైడిపల్లికి కాపీ కొట్టాల్సినంత అవసరం ఏం ఉంటుంది? ఇదివరకూ ఓ ఫ్రెంచి సినిమా రైట్స్ తీసుకుని `ఊపిరి` వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఆ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఒకవేళ మహేష్- నరేష్ సినిమాకి బాలీవుడ్ స్ఫూర్తి ఉంటే – ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని ఉంటారు కదా! అన్న వాదనా వినిపిస్తోంది. చిత్రయూనిట్ నుంచి స్పందన రావాల్సి ఉందింకా.