స్పైడర్‌ రెండో పాట ‘పుచ్చకాయ..’?

0Spyder-songsసూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఇటీవల ఈ చిత్రంలోని ‘బూమ్‌ బూమ్‌’ అనే తొలిపాట విడుదలైంది. ఈ పాటకు మహేశ్‌ అభిమానులను నుంచి విశేష స్పందన లభించింది.

త్వరలో ఈ సినిమాలోని ‘పుచ్చకాయ పుచ్చకాయ’ అనే రెండో పాటను విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు బ్రిజేశ్‌ శాండిల్య పాడారు. బ్రిజేశ్‌ ‘సరైనోడు’ టైటిల్‌ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు గాయకుడిగా పరిచయమాయ్యరు. ఇప్పుడు ‘స్పైడర్‌’ చిత్రంలో ‘పుచ్చకాయ..’ అనే పాట పాడారట. ఈ పాట అరబిక్‌ లిరిక్స్‌తో వెరైటీగా ఉంటుందని చిత్రవర్గాల సమాచారం.

‘స్పైడర్‌’ చిత్రంలో ఎస్‌.జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు అరబిక్‌ వెర్షన్‌లో కూడా విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 27న ‘స్పైడర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.