స్టైల్ అదుర్స్: స్పైడర్ ‘బూమ్ బూమ్’ సాంగ్ టీజర్

0మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పైడర్’ మూవీకికి సంబంధించిన సాంగ్ టీజర్ విడుదలైంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ‘బూమ్ బూమ్’ అంటూ సాగే పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో అభిమానులను సర్‌ప్రైజ్ అయ్యారు.

‘బూమ్ బూమ్’ పూర్తి పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. పాటతో పాటు సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు ఊపందుకకున్నాయి.

‘స్పైడర్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ మీద ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమేనియాలో ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విజయదశమి సందర్భంగా ‘స్పైడర్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.