స్పైడర్ విడుదలకి ముహుర్తం ఖరారు

0Spyder-teamబ్రహ్మోత్సవం తరువాత లేటు చేయకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి రకరకాల ఊహగానాలు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య వినిపిస్తున్నాయి.

మహేశ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడని చెన్నై – హైదరాబాద్ తదితర చోట్ల స్పైడర్ షూట్ శరవేగంగా జరుగుతోందనే అప్ డేట్స్ షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు బాహుబలి 2 దెబ్బకి తెలుగు సినిమాల మార్కెట్ బాగా పెరగడంతో స్పైడర్ కు బిజినెస్ బాగా జరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో స్పైడర్ బడ్జెట్ ను 80 కోట్లు నుంచి 150 కోట్లకి పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలానే బడ్జెట్ పెరగడంతో ఫైనాన్స్ విషయంలో స్పైడర్ కి సినిమా కష్టాలు ఎదురవుతున్నాయనే వారు లేకపోలేదు. అయితే తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యాన్సీ రేట్లకి స్పైడర్ బిజినెస్ జరిగిందని తెలిసింది.

స్పైడర్ నైజాం రైట్స్ ను దిల్ రాజు – ఈస్ట్ రైట్స్ ను వింటేజ్ ఫిల్మ్ వారు – వెస్ట్ రైట్స్ ను ఎల్.వి.ఆర్ – క్రిష్ణ జిల్లా హక్కులను గీతా వారు – సీడెడ్ ఏరియాని ఎన్.వి.పి – నెల్లూరులో చక్రదర్ – ఓవర్సీస్ ను బాలాజీ వారు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలిసింది. మరి భారీ అంచనాలతో తెరకెక్కతున్న స్పైడర్ – మహేశ్ ఫ్యాన్స్ ను ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.