స్పైడర్ @యూఎస్ టాప్4

0Spyder-Overseas-collectionsమహేష్ బాబు మూవీ స్పైడర్ థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. మౌత్ టాక్ విషయంలో కాస్త అటూఇటూగా ఉన్నా.. మహేష్ నుంచి వచ్చిన ఈ స్టైలిష్ థ్రిల్లర్ ను ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కింగ్ అని బిరుదు ఉన్న సూపర్ స్టార్.. తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. యూఎస్ లో ఈ మూవీ ఆరంభంలోనే అదరగొట్టేసింది.

చాలామంది స్టార్ హీరోల సినిమాలు ఫుల్ రన్ లో కూడా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకోవడానికి తిప్పలు పడుతుంటారు. అయితే.. స్పైడర్ మాత్రం కేవలం ప్రీమియర్స్ తోనే ఈ ఫీట్ ను సాధించేశాడు. మంగళవారం నాడు ప్రదర్శితమైన ప్రీమియర్స్ ద్వారానే మహేష్ నటించిన స్పైడర్ $1005630 డాలర్లను అందుకోవడం రికార్డ్ గా నిలిచింది. ప్రీమియర్స్ ద్వారా టాలీవుడ్ మూవీస్ కలెక్ట్ చేసిన ఫిగర్స్ విషయంలో.. స్పైడర్ 4వ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న బాహుబలి2.. 4.59 మిలియన్స్ సాధించగా.. రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి తొలి భాగం 1.39 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీమియర్స్ ద్వారా 1.29 మిలియన్ల డాలర్లను వసూలు చేసి మూడో స్థానంలో ఉంది.

స్పైడర్ నాలుగో ప్లేస్ కు మాత్రమే పరిమితం అయినా.. 1 మిలియన్ మార్క్ ను వాస్తవ రిలీజ్ డేట్ కి ముందు రోజే అందుకోవడం అంటే.. చాలా పెద్ద విషయమే. వీకెండ్ నాటికి స్పైడర్ కలెక్షన్స్ మరింతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని.. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అంచనా వేస్తున్నారు.

స్పైడర్ ఏపీ+నైజాం ఫస్ట్ డే వసూళ్లివే!

ఏపీ.. తెలంగాణల్లో కలిపి స్పైడర్ మూవీ మొదటి రోజున 15.3 కోట్లను రాబట్టగలిగింది.

తొలి రోజున స్పైడర్ ఏపీ-తెలంగాణ కలెక్షన్స్ వివరాలు(కోట్లలో) ఏరియా షేర్ గ్రాస్

నైజాం 3.60 6.00
సీడెడ్ 1.80 2.40
వైజాగ్ 1.75
ఈస్ట్ 2.31
వెస్ట్ 1.90
కృష్ణా 0.89
గుంటూరు 2.02
నెల్లూరు 1.03
ఆంధ్రా 9.90 15.0
నైజాం+ఏపీ 15.3 23.4