‘శ్రద్దా’ కోసం సాహో ఎదురుచూపులు..

0బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో. సుజిత్ దర్శకత్వం లో యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి మొదటి నుండి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా హీరోయిన్ శ్రద్దా వల్ల షూటింగ్ కు మరింత ఆలస్యం అవుతుందని వినికిడి.

మొన్నటి వరకు దుబాయ్ లో షూటింగ్ కు పర్మిషన్ రాక ఖాళీగా ఉన్న చిత్ర యూనిట్ , తీరా అది వచ్చాక హీరోయిన్ శ్రద్దా వేరే సినిమాల షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల సాహో లో అడుగుపెట్టలేకపోతుంది. దీంతో ఆమె ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలో అని ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ ఎదురుచూస్తున్నారు.