అర్జున్‌రెడ్డి సినిమాపై శ్రావ్యా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0Sravya-Reddyతెలుగునాట వివాదాస్పదంగా మరిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే జంటగా నటించిన ఈ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో మొదలు బుల్లితెర బ్యూటీ అనసూయ దాకా పలువురు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నటి శ్రావ్యారెడ్డి చేరింది. పూరీ-కల్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇజం’ సినిమాలో జర్నలిస్ట్‌గా నటించిన శ్రావ్య.. అర్జున్‌రెడ్డి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తనకు చాలా తక్కువ సినిమాలు చూసినప్పుడు తలనొప్పి వస్తుందని, అలా తనకు తలనొప్పి తెప్పించిన చిత్రాల్లో ‘అర్జున్‌రెడ్డి’ ఒకటని శ్రావ్యారెడ్డి చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు ‘అర్జున్‌రెడ్డి’ అని పేరు పెట్టడంపై కూడా శ్రావ్యారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో అర్జున్ కుటుంబం రెడ్లు కాదని, దేశ్‌ముఖ్‌లు అని, దేశ్‌ముఖ్ స్థానంలో రెడ్డి అని ఎలా పెడతారని ప్రశ్నించింది. కావాలంటే అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్ అని పెట్టండి.. కానీ, అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్ అనే దాన్ని తాను వ్యతిరేకిస్తున్నాని శ్రావ్యారెడ్డి చెప్పింది.

సినిమాతోపాటు అందులో హీరోయిన్‌గా నటించిన శాలినీ పాండేపై కూడా శ్రావ్యారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోయిన్ ఫేస్‌కు యుద్ధాలు చేసేంత, డ్రగ్ అడిక్ట్ అయ్యేంత సీన్ లేదంటూ శ్రావ్యా అభిప్రాయపడింది. ‘‘సినిమాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండీ డైరెక్టర్ గారు? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ చేసుకోమనా?’’ అంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగను ప్రశ్నించింది.