భలే మారిపోయాడే!

0పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ విభిన్నమైన కథలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న హీరో శ్రీవిష్ణు మరోసారి అలాంటి ప్రయత్నంతో వస్తున్నాడు. ఇంద్రసేనా దర్శకత్వంలో రూపొందిన వీరభోగవసంత రాయలులో శ్రీవిష్ణు లుక్ ని టీమ్ విడుదల చేసింది. గుబురుగా పెరిగిన గెడ్డంతో వెనుకగా పొడవాటి పోనీ టైల్ లాంటి జుట్టుతో గుర్రాన్ని నడిపించుకుని వస్తున్న తీరు చూస్తుంటే కొత్త తరహాలో స్టైలిష్ పాత్ర ఇందులో చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మల్టీ స్టారర్. నారా రోహిత్ లుక్ ఇటీవలే విడుదల కాగా కొద్దిరోజుల క్రితం వదిలిన శ్రేయ శరన్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక బయటికి రావాల్సింది సుధీర్ బాబు గెటప్ ఒకటే. టైటిల్ ను బట్టి ఇదేదో ఫాంటసీ తరహా కథాంశంలాగా అనిపిస్తున్నాపోస్టర్లు మాత్రం వాటికి భిన్నంగా అనిపిస్తూ అసలు ఇది ఏ జానరా అని ఆలోచించుకునేలా చేస్తున్నాయి. కల్ట్ ఈజ్ రైజింగ్ అనే ట్యాగ్ తో ఊరిస్తున్న టీమ్ దానికి తగ్గట్టే పోస్టర్లు వదులుతోంది.

అందిన సమాచారం మేరకు టైటిల్ లో ఉన్న వీర భోగ వసంత రాయలు ఈ నలుగురి పేర్లని టాక్. నిజమో కాదో కానీ పేరు మాత్రం బాగా కనెక్ట్ అవుతోంది. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఎస్ వెంకట్ ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. డిఫెరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందుతున్న సినిమాలకు ఈ మధ్య మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపధ్యంలో వీరభోగవసంతరాయలు మీద కూడా మంచి బజ్ ఉంది. శ్రీవిష్ణు లుక్ చూసాక అంచనాలు ఇంకాస్త పెరిగాయి. క్రేజీ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ లైన్ ఏంటో తెలియాలంటే టీజర్ వచ్చే దాకా ఆగాల్సిందే.