ఒక చిన్న హీరోతో ఎన్టీఆర్ హీరోయిన్..

0జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నివేత థామస్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ క్యూటీ నటనటలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత నిన్ను కోరి – ‘ఎన్టీఆర్’ జై లవ కుశ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకోనిక్ స్టార్ హీరోలను ఆకర్షించింది. టాప్ దర్శకులైతే నివేత డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్. కానీ నివేత మాత్రం తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే ఒకే చేస్తోంది.

పెద్ద చిన్నా అని తేడా లేకుండా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వెంటనే ఒప్పేసుకుంటోందట. ఇక రీసెంట్ గా అమ్మడు శ్రీ విష్ణు సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కథలో మంచి నటనకు ప్రాధాన్యం ఉండడంతో సింగిల్ సిట్టింగ్ లో ఎలాంటి అనుమానాలు లేకుండా ఒప్పుకుందట. మెంటల్ మదిలో సినిమాతో డీసెంట్ హిట్ అందుకొని ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇటీవల నివేత థామస్ కు కథ వినిపించాడట.

లవ్ అండ్ ఎమోషనల్ కథతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఉండేలా కథను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు కూడా ప్రస్తుతం కొంచెం కొంచెం తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో మరికొంత హైప్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. ఇక నివేత థామస్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాలో చేస్తోంది.ఆ షూటింగ్ తో పాటు శ్రీ విష్ణు ప్రాజెక్ట్ లో కూడా అమ్మడు కంటిన్యూ అవ్వనుందని సమాచారం.