చిరు సాంగ్ కి శ్రీముఖి స్టెప్పులు

0యాంకర్ గాన్ యాక్ట్రెస్ గా కూడా శ్రీముఖి స్పీడ్ బాగానే ఉంది. ఈ మధ్యనే మెగా క్యాంప్ లో ఆఫర్ కూడా వచ్చిందనే టాక్ వినిపించింది కానీ.. ఆ అవకాశం మిస్ అయింది. ఆ సంగతలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ మూవీ సాంగ్ కి అమ్మడు ఓ డబ్ స్మాష్ చేసింది.

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. పాట కు శ్రీముఖి చేసిన డబ్ స్మాష్ చూస్తే ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందో అర్ధమవుతుంది. హీరోయిన్ వెర్షన్ కి మాత్రమే కాదు.. చిరుకి వినిపించే దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ కి.. చివర్లో వినిపించే మెగాస్టార్ వాయిస్ కి కూడా ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అంటూ వీర లెవెల్లో ఫీలింగులు ఇచ్చేసింది. సాంగ్ తో పాటు ఈ అమ్మడు ఇస్తున్న ఫీలింగ్స్ చూస్తుంటే.. హీరోయిన్ రేంజ్ కి అర అంగుళం కూడా తగ్గకుండా అదరగొట్టేసిందని అర్ధమవుతుంది.

‘అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు.. ఇది మాస్ సాంగ్ కాదు.. ఇది బాస్ సాంగ్.. డీఎస్పీ.. నువ్వు మ్యాజిక్ చేసేస్తావంతే’ అంటూ ఓ ట్వీట్ కూడా పెట్టింది శ్రీముఖి. మెగా క్యాంప్ లో ఛాన్స్ మిస్ అయింది కాబట్టి.. ఇలా ఏకంగా మెగాస్టార్ పాటకే డబ్ స్మాష్ చేసి తన అభిమానం చాటుకుంటోందా.. ఆ యాంగిల్ లోంచి ప్రయత్నాలు చేస్తోందా? ఆన్సర్ ఈ యాంకర్ అమ్మడే చెప్పాలి.