చైనీస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న తెలుగోడు

0ఒక్క సినిమా డిజాస్టర్ అయితే నటీనటులకు పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. ఎదో ఒక విధంగా నటనతో గుర్తింపు తెచ్చుకుంటే మరికొన్ని ఆఫర్స్ అందుకుంటారు. కానీ దర్శకులకు మాత్రం ఫెయిల్యూర్ దెబ్బ అంత ఈజీగా మానదు. ఆ తరువాత సొంతంగా సినిమాలు చేసినా కూడా బయట మార్కెట్ ఉండదు. కానీ కొందరు యువ దర్శకులు ఈ రోజుల్లో రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు.

గత ఏడాది డిఫరెంట్ గా వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ అనే సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. శవాలతో శృంగారం కాన్సెప్ట్ మీద ఆ సినిమా తెరకెక్కింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా దర్శకుడు సశేషం అనే సినిమా కూడా చేశాడు. అతని పేరు శ్రీ కిషోర్ ఇప్పుడు మరో కొత్త తరహా ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగులో వర్కౌట్ కాదు అనుకున్నాడో ఏమో మరి చైనీస్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. చైనాకి మనోడికి మంచి రిలేషన్ ఉండడం వల్ల అక్కడ సినీ వాతావరణం మీద పట్టుంది. హాంగ్ కాంగ్ లో శ్రీ కిషోర్ 10 ఏళ్లు డాన్స్ టీచర్ గా వర్క్ చేశాడు.

బాహుబలి – పీకే -3 ఐడియట్స్ సినిమాలకు సంబంధించిన పాటల డ్యాన్సుల విషయంలో అక్కడి వారికి కోచింగ్ ఇచ్చాడు. ఇక తెలుగు కుర్రాడి ప్రేమలో చైనా పిల్లను పడేసే కాన్సెప్ట్ ను నెక్స్ట్ సినిమా కోసం ఎంచుకున్నాడు. ఇండియన్ బాయ్ ఫ్రెండ్ అనే టైటిల్ ను కూడా సెట్ చెసుకున్నాడు. అక్కడే స్థిరపడిన ఒక ఒక తెలుగు యువకుడు చైనీస్ గర్ల్ ప్రేమలో ఎలా పడ్డాడు అనే అంశం అందరికి నచ్చుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇక శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మిగతా టెక్నీషియన్స్ మొత్తం చైనీస్ కు సంబంధించిన వారే..