శ్రీ రెడ్డి కేసు పెట్టింది..ఎవరిపైనో తెలుసా..?

0కాస్టింగ్ కౌచ్ పేరుతో పాపులర్ అయినా శ్రీ రెడ్డి..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఫై కేసు పెట్టింది. కేవలం అభిమానులపైనే కాదు కొంతమంది నెటిజన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

” తనని సోషల్ మీడియాలో వెంటపడి మరీ అశ్లీలంగా కామెంట్స్ చేయడమే కాకుండా బూతు వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అలాగే కొంతమంది నెటిజన్ల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది”. కాస్టింగ్ కౌచ్ ఫై పోరాటం అంటూ హల్చల్ చేసిన శ్రీ రెడ్డి , ఆ తర్వాత కొంతమందిని టార్గెట్ చేయడం తో ఆమె పోరాటం పక్క దారి పట్టింది. దీంతో అమ్మడి వైపు చూడడం మానేసారు. ఈ నేపథ్యం లో మళ్లీ వార్తల్లో నిలిచేందుకు శ్రీ రెడ్డి కొత్త కొత్తగా ట్రై చేస్తుంది.