ఇంకెందుకు ఆలస్యం తొడ కొట్టండి ఫ్యాన్స్..!

0

తెలుగు స్టార్స్ పై సంచలన కామెంట్స్ చేసి ఒక్కసారిగా జాతీయ స్థాయి మీడియాలో సైతం పబ్లిసిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ను – పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. పవన్ పై కొన్ని సార్లు శృతి మించి మరీ పోస్ట్ లు పెట్టిన శ్రీరెడ్డి తాజాగా ఎన్టీఆర్ విషయంలో మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కి విడుదలైన ‘అరవింద సమేత’ చిత్రం గురించి శ్రీరెడ్డి స్పందించింది.

శ్రీరెడ్డి ట్విట్టర్ లో.. ఇంకెందుకు ఆలస్యం – ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా తొడకొట్టండి. అరవింద సమేత చిత్రం చాలా బాగుంది ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్విట్టర్ పేజీ శ్రీరెడ్డి దేనా కాదా అనే విషయం క్లారిటీ లేదు. కాని ఆమె పేరుతో ఉన్న ఈ పేజీలో ఈ చిత్రం గురించి పోస్ట్ చేయడంతో నందమూరి అభిమానులు ఆ పోస్ట్ ను తెగ షేర్ చేస్తూ – లైక్ లు కొట్టేస్తున్నారు.

మరో వైపు శ్రీరెడ్డి మీటూ ఉద్యమానికి తనవంతు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఎప్పటికప్పుడు స్టార్స్ మీటూ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సమయంలో వాటిపై శ్రీరెడ్డి స్పందిస్తూ వస్తుంది. తాజాగా శ్రీరెడ్డి తమిళంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో తమిళంకు చెందిన ఒక నటి జీవిత చరిత్రను చూపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తమిళంలో సినిమా చేస్తూ కూడా సమయం చికినప్పుడు తెలుగు స్టార్స్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంది.
Please Read Disclaimer