తమిళ లీక్స్.. శ్రీరెడ్డి మరో దుమారం..

0కాస్టింగ్ కౌచ్ పేరు తో టాలీవుడ్ పరువు బజారుకీడ్చిన శ్రీరెడ్డి ఇక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తమిళనాడు బయలుదేరింది. తమిళ లీక్స్ అంటూ కొత్త వివాదాన్ని మొదలుపెట్టింది. చైన్నైలో ఉన్న శ్రీరెడ్డి చేస్తున్న లీక్స్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. తనకు తమిళ దర్శకులు – నటులు – నిర్మాతలతో పరిచయం ఉందని.. వారంతా తనను వాడుకొని మోసం చేశారని.. వారి పేర్లు బయటపెడుతూ దుమారం రేపుతోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాగోతాలను బయటపెడుతున్న శ్రీరెడ్డి పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత మంది నిన్ను మోసం చేశారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా శ్రీరెడ్డి ఫేస్ బుక్ ద్వారా స్పందించింది.

శ్రీరెడ్డి వ్యాఖ్యానిస్తూ.. ‘నా లిస్టు చాలా చిన్నది’ అని పేర్కొంది. కొందరి హీరోయిన్ల పేర్లు పరోక్షంగా ప్రస్తావించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఆ హీరోయిన్లంతా కొన్ని నోరువిప్పితే ఆ లిస్టు ఎంత పెద్దదో అర్థం అవుతుందని’ చెప్పుకొచ్చింది. నిజాలు తెలిస్తే చస్తారు అంటూ శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చింది.

శ్రీరెడ్డి ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమలోని కొందరు నటులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. రాఘవ లారెన్స్ – శ్రీకాంత్ – మురగదాస్ లాంటి ప్రముఖులు తనను వాడుకొని వదిలేశారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా చెన్నైలో ఉండి కోలీవుడ్ సినీ సెలెబ్రెటీలపై ఆరోపణలు చేస్తోంది. టాలీవుడ్ ను షేక్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ బండారం బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.