నాని బండారం బయటపెడతా -శ్రీరెడ్డి

0కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ వివాదాలతో వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి ఈమధ్య కాస్త సైలెంట్ గానే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన నెగిటివ్ కామెంట్లతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో కాస్త తగ్గినట్టే కనిపించింది. తాజాగా మరోసారి ఇండస్ట్రీలోని హీరోను టార్గెట్ చేస్తూ తన స్వరం వినిపించడం మొదలెట్టింది.

ఈసారి శ్రీరెడ్డి నాచురల్ స్టార్ నానిపై తీవ్రమైన కామెంట్లే చేసింది. అతడు తనకొచ్చే అవకాశాలు అన్నీ చెడగొడుతున్నాడంటూ మండిపడిపోయింది. ప్రస్తుతం టీవీ ఛానళ్లు శ్రీరెడ్డి మాటలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా శ్రీరెడ్డి ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. ‘‘నాని + శ్రీ =డర్టీపిక్చర్. వాటీజ్ దట్? మా ఇద్దరికీ జరిగిన లవ్ స్టోరీ… దానికి కామ కథ అంటే బెటర్. తొందరలోనే దానిని బయటపెడతా. ఎప్పుడైతే నాకొచ్చే ఆఫర్లు తొక్కుదామని చూస్తున్నావో నీకు సంబంధించిన రంకు పురాణాలు అందరికీ తెలియాలి కదా. నువ్వు ఎవరితో తిరిగావో.. వాళ్లకున్న అలవాట్లేంటో బయటపెడతా’’ అంటూ ఆ వీడియోలో శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

మాటీవీలో వచ్చే బిగ్ బాస్ సీజన్ 2కు లో శ్రీరెడ్డి పార్టిసిపెంట్ గా ఎంపికయిందని అప్పట్లో ఓ టాక్ గట్టిగా వచ్చింది. ఇదే షోకు నాచురల్ స్టార్ నాని హీరోగా హోస్ట్ గా చేస్తున్నాడు. గతంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన శ్రీరెడ్డిని పార్టిసిపెంట్ గా సెలక్ట్ చేయడంపై నాని అబ్జెక్షన్ చెప్పాడని.. దాంతో మాటీవీ వాళ్లు ఈ విషయంలో వెనక్కి తగ్గారని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. తన అవకాశాలు చెడగొడుతున్నాడంటూ శ్రీరెడ్డి చెప్పింది బిగ్ బాస్-2ను ఉద్దేశించే అనుకోవచ్చు.