నాని కాపురంలో నిప్పులేనట

0మీడియాల్లో అయిపోయాక సోషల్ మీడియానే దిక్కే అని విమర్శకులు వారి కామెంట్స్ ను ఇటు వైపు షిఫ్ట్ చేస్తున్నారు. ఓ కామెంట్ చేస్తే పది మందికి తెలియాలి. పెద్దవాళ్లను అనకూడదు. కానీ ఓ వర్గం పాపులారిటీ ఉన్న వారిని బాగా గెలికేయాలని టార్గెట్ పెట్టుకోవడం ఈ ప్రపంచంలో బాగా అలవాటుగా మారింది. ఆ సంగతి పక్కనపెడితే అమ్మాయిల కోసం పోరాడుతున్నా అని శ్రీ రెడ్డి గారు రాజకీయాల నుంచి సినిమా హీరో – దర్శకుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆమె రూట్ ఏంటో ఇప్పటికి ఓ క్లారిటీ రావడం లేదని కామెంట్స్ చేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం నాని ని టార్గెట్ చేసిన ఈ మేడమ్ గారు పర్సనల్ గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. నీ కాపురంలో నిప్పులే అనేట్టుగా కామెంట్ చేశారు అంటే.. డోస్ ఏ లెవెల్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అలాగే నాని + శ్రీ రెడ్డి = డర్టీ పిక్చర్ అంటూ.. కమింగ్ సూన్ అంటూనే నానిని ధూషించేశారు ఆమె.

నాని గాడి రాసలీలలు అన్ని బయట పెడతా – కాసుకోర నాని – నీ కాపురం లో నిప్పులే అంటూ.. ఫ్యామిలీ ఎమోజి ని యాడ్ చేశారు. మేడం గారు ఈ లెవెల్లో అంటుంటే నెటిజన్స్ ఊరుకుంటారా? వారి స్టైల్ లో వాళ్లు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. మొన్న పవన్.. నిన్న రానా.. ఈ రోజు నాని.. ఇక రేపు ఎవరో అని కామెంట్ చేస్తున్నారు. నాని నెక్స్ట్ బిగ్ బాస్ లో హోస్ట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతనికి ఇప్పుడు క్రేజ్ ఎక్కువ కాబట్టి కావాలనే టార్గెట్ చేసినట్లు మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.