పవన్ కల్యాణ్ పర్సనాలిటి పై శ్రీరెడ్డి షాకింగ్ పోస్టులు!

0జనసేన అధ్యక్షుడు – సినీ నటుడు పవన్ కల్యాణ్ పై మెగా ఫ్యామిలీపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తన ఫ్యాన్స్ కు పవన్ నచ్చజెప్పుకోవాలని – క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా తనపై ట్రోలింగ్ ఆపడం లేదని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పటివరకు తన సొంత పోస్టులను పెడుతూ వచ్చిన శ్రీరెడ్డి తాజాగా ఫేస్ బుక్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ వాల్స్ పై నచ్చిన పోస్టులను తన వాల్ పై పోస్ట్ చేస్తానని…అంతకుముందు తన ఫేస్ బుక్ ఖాతాలో శ్రీరెడ్డి చెప్పింది. బహుశా అందులో భాగంగానే తన ఫేస్ బుక్ మిత్రులు పెట్టిన రెండు పోస్టులను శ్రీరెడ్డి తన వాల్ పై పోస్ట్ చేసింది. ప్యారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్నారంటూ….పరోక్షంగా (పేరు ప్రస్తావించకుండా) ఉద్దేశించి ఎవరో పెట్టిన పోస్ట్ ను శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ మానసిక వ్యాధి లక్షణాలు….పరోక్షంగా ట్వీట్లకు ప్రవర్తనకు మ్యాచ్ అవుతున్నాయని ఆ పోస్ట్ సారాంశం.దాంతోపాటు – పరోక్షంగా మరో ఫేస్ బుక్ ఫ్రెండ్ పెట్టిన పోస్ట్ ను శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినిమాల్లో నటించడం రాకపోయినా బయట బాగానే నటిస్తున్నారంటూ…..ఆ పోస్ట్ లో సుదీర్ఘ వ్యాఖ్యానం ఉంది.

“నాకు ఎఫ్ బీ లో ఫ్రెండ్స్ వాల్స్ మీద నచ్చిన పోస్ట్స్ నేను డౌన్ లోడ్ చేసుకొని పెడుతున్న పోస్ట్స్….“అని శ్రీరెడ్డి కింద తెలిపిన పోస్ట్ పెట్టింది.

మిస్టర్ ….. ఏమిటి ఈ మాయ…పాచి పోయిన లడ్డులు అన్నావు..ఉత్తరం దక్షిణం అన్నావు..అవినీతి జరుగుతుందన్నావు..నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు…చూసుకోండి అన్నావు…నాకు కులం లేదూ అన్నావు..మా రంగాను అన్యాయంగా చంపేశారు అని అన్నావు…కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు..పెద్ద ఫార్సు చేశావు…లెక్కలు నేను తేలుస్తాను అన్నావు…కమిటీలో దొంగల్ని పెట్టావు.. మా అన్న చేసింది తప్పు అన్నావు..మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు..నీకు గెలిచే సత్తా లేక పోయినా పేద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు…పవర్ ను అనుకున్నావు..ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో…ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు…. ఒకటికి మూడు చేసుకున్నావు…..నీ అవసరాలకోసం అందర్నీ దగా చేశావు..చివరకు అమ్మకు కూడా బురద పూశావు…చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు..నీకు నటన రాదనుకున్నాము కాని సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు…నిన్నేమనాలి….నువ్వు ఆంధ్రద్రోహివి…ప్రజా ద్రోహివి..జనద్రోహివి.తెలుగుప్రజలు నిన్ను క్షమించరు……

ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు…. ఎవరూ ఏమాట మోడీని అన్నా… మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు…..ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం….

ఆ తర్వాత శ్రీరెడ్డి మరో పోస్ట్ ను పెట్టింది. కానీ ఇందులో ఎవరి పేరును ఉద్దేశించ లేదు. అయితే ఈ పోస్టు శ్రీరెడ్డి సొంతగా పెట్టిందా….లేదంటే పైన తెలిపిన పోస్టు మాదిరిగానే తన ఫ్రెండ్స్ వాల్ పై నుంచి కాపీ చేసి పెట్టిందా అన్న విషయంపై స్పష్టత లేదు.

ఖఛ్చితంగా PPD (Paranoid personality disorder) అనబడే ఒక మానసిక వ్యాధి కి సంబంధించిన రోగ గ్రస్తుడు
అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి.

1) ఆధారాలేమి లేకుండా అనుమానాలు అపనమ్మకాలలో మునిగిపోవడం
2) అనూన్యతా భావం తో చిన్న చిన్న విషయాలకి కూడా భరించలేని అవమానం ఫీల్ అవ్వడం
3) తాను నమ్మే వాటి నిర్ధారణ కోసం తన కళ్ళకి మాత్రమే కనిపించే క్లూ లని ఊహించుకోవడం
4) లేని శత్రువుల నుంచి తనకేదో వాళ్ళనుంచి ప్రమాదం ఉందనుకునే భ్రమలో కూరుకుపోయి లేదని ప్రూవ్ చేసినా అర్ధమయ్యే శక్తి కోల్పోవడం
5) మీనింగ్ ఫుల్ భావోద్వేగాల్ని కోల్పోవడం వల్ల Schizoidisolation అనబడే ఒంటరి తనం కోరుకునే ఇంకొక మెంటల్ ప్రాబ్లెమ్ కి లోనవడం
6) అకారణంగా పగల్ని ప్రతీకారాల్ని పెంచుకుని ఎవరేం చేసినా తనని తొలిగించటానికే ప్లాన్ చేస్తున్నారని అనుకోవడం.

ఈ 6 పాయింట్లని స్టడీ చేసిచేష్టల్ని కానీట్వీట్లని కానీ పరిశీలిస్తే ఈ 6 పాయింట్లు కూడా మ్యాచ్ అవుతాయి.ఈ వ్యాధి ఉన్న మెంటల్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చెయ్యకపోతే ముందు ముందు Schizotypal మరియు Schizoid అనబడే ఇంకో రెండు మెంటల్ వ్యాధులు కూడా రావటానికి అవకాశముంది. కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్థుడినని ఒప్పుకోవాల్సిన అవసరముంది…..అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.