కేసీఆర్ సర్..నన్ను బహిష్కరించవద్దు: శ్రీరెడ్డి

0టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నటి శ్రీరెడ్డి. తాజాగా ఈమె తన ఫేస్ బుక్ ద్వారా సీఎం కేసీఆర్ కు ఓ విన్నపం చేసింది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేస్తూ చేసిన ఫేస్ బుక్ పోస్ట్ సంచలనమైంది..

‘గౌరవనీయులైన సీఎం కేసీఆర్ సార్.. దయచేసి ఇండస్ట్రీలోని ఈ కాస్టింగ్ సమస్యను దయచేసి పట్టించుకోవాలని’ కేసీఆర్ ను శ్రీరెడ్డి కోరింది. ‘మా’ అసోసియేషన్ – ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు తనను మానసికంగా – శారీరకంగా హింసిస్తున్నారని.. మీరు తండ్రి లాంటి వారు.. తెలంగాణ రాష్ట్రానికి కింగ్ – మా పరిస్థితి దారుణంగా ఉంది.. అర్థం చేసుకోండి.. సమస్యను పరిష్కరించండి అని కేసీఆర్ ను వేడుకుంది శ్రీరెడ్డి..

‘ఎన్నిరోజులు మేం ఈ బాధలు పడాలి. డ్రగ్స్ అలవాటు – హీరోయిన్లను శారీరకంగా మోసం చేసే వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని’ శ్రీరెడ్డి బాంబు పేల్చింది. రాజకీయంగా దుమారం రేపే ఉద్దేశం తనకు లేదని.. రాజకీయ నేతల గురించి మాట్లాడితే తనకు న్యాయం జరగదని తెలుసున్నారు. ఒకవేళ తెగించి మాట్లాడితే నన్ను చంపేస్తారని.. అందుకే వారి జోలికి పోనని’ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది.

హీరోయిన్లను మోసం చేస్తున్న వారిలో మీకు సన్నిహితులైన రాజకీయ నేతలు కూడా ఉన్నారని శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకే తాను రాజకీయ నేతల పేర్లను బయటపెట్టాలనుకోవడం లేదని.. నోరు మూసుకొని ఉంటానని స్పష్టం చేసింది.

చివరగా కేసీఆర్ సార్.. సినీ ఇండస్ట్రీలోని పెద్ద తలకాయల నుంచి మాలాంటి వారిని కాపాడాలని శ్రీరెడ్డి వేడుకుంది. ‘‘ నేను నిజాలు మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి దయచేసి నన్ను బహిష్కరించవద్దని’’ విన్నవించింది.. మిమ్మల్ని కలవడం నా వల్ల కావడం లేదని.. అందుకే సోషల్ మీడియా ద్వారా అయినా ఈ విషయం మీకు చేరాలని ఈ పోస్టు పెడతానని శ్రీరెడ్డి తెలిపారు.