‘పుల్కాకు మళ్లీ గుండు.. ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో’

0

నసేన అధినేత పవన్ కళ్యాణ్‌, ఆయన సోదరుడు నాగబాబుపై శ్రీరెడ్డి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో కాక రేపుతోంది. ‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ ఆమె పరోక్షంగా వారిద్దరిపై విమర్శలు గుప్పిస్తూ.. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. తాజాగా పవన్ ఓటమిపై కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత హీట్ పెంచేసింది.

‘‘షూటింగులు పాయే.. పాలిటిక్స్ పాయే.. ఏం చేయాలో తెలియక ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో’’ అంటూ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. అనంతరం ‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు. తెలంగాణకు వస్తే కేసీఆర్, ఆంధ్రాకు వస్తే జగన్’’ అని పేర్కొంది. ‘‘జగన్ పేరు ఎత్తగలరా ఇప్పుడు స్నేక్ బాబు, పుల్కా కళ్యాణ్.. మళ్లీ కొట్టేస్తాం గుండు. స్నేక్ బాబుకు ఆల్రెడీ ఎవరో కొట్టేశారు గుండు’’ అని కామెంట్స్ చేసింది.


ఫలితాల్లో వైసీపీ గెలిచిందని తెలిసిన సమయం నుంచి శ్రీరెడ్డి మెగా సోదరులపై కామెంట్ల వర్షం కురిపిస్తోంది. నాగబాబు ఓటమి చవిచూశాడని తెలియగానే ఆయన్ని టార్గెట్ చేసుకుంది. ‘‘మూలశంఖోడు ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ?? జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టుడియో గేట్ దగ్గర వెయిటింగ్ అంటగా..’’ అంటూ వివాదాస్పద కామెంట్లను పోస్ట్ చేసింది. దీంతో మెగా అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.
Please Read Disclaimer