ఆ క్రికెటర్ బాగా రొమాన్స్ చేస్తాడు:శ్రీరెడ్డి

0టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన సంచలన ఆరోపణలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోలీవుడ్ హీరోలు దర్శకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ….అక్కడే మకాం వేసి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో శ్రీరెడ్డి ..తాజాగా క్రీడాకారులపై తన విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టింది. భారత్ లో క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై పరోక్షంగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. సచిన్ తో పాటు చాముండేశ్వరీనాథ్ పై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నటి పేరును కూడా పరోక్షంగా ప్రస్తావించిన శ్రీరెడ్డి…ఆ ముగ్గరి గురించి తన ఫేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

“సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఛార్మిం’గ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. పెద్ద మనిషిగా పేరున్న చాముండేశ్వర స్వామి ఈ రొమాన్స్ కు మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు. నా ఉద్దేశం బాగా రొమాన్స్ చేస్తారు“అని శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే – సచిన్ – చాముండేశ్వరీనాథ్ – ఛార్మిల పేర్లను ప్రస్తావించకుండా….వారి గురించి చెప్పడం శ్రీరెడ్డి పోస్ట్ ఉద్దేశమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ పేర్లను చూడగానే….వారినే శ్రీరెడ్డి టార్గెట్ చేసిందని స్పష్టమవుతోందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే గతంలో పలువురిపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి….వాటికి సంబంధించిన ఆధారాలు చూపడంలో మాత్రం ఆసక్తి చూపలేదు. కొంతమంది ఫొటోలు – స్క్రీన్ షాట్స్ బయటపెట్టి హల్ చల్ చేసిన శ్రీరెడ్డి…తాజా ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపెడుతుందో ….లేదో వేచి చూడాలి.