శ్రీదేవిని ఇలా చూస్తే షాకే..

0ఏదో మొహమాటానికి అతిలోక సుందరి అతిలోక సుందరి అంటూనే ఉన్నారు కానీ.. శ్రేదేవి మునుపటి అందచందాలు కోల్పోయి చాలా ఏళ్లయిపోయింది. వయసు ప్రభావంతో మునుపటి గ్లో కోల్పోయి చాలా ఇబ్బందికరంగా తయారైంది శ్రీదేవి. అయినప్పటికీ ఆమెను అపురూప సౌందర్య రాశిగా కీర్తించడం మానలేదు చాలామంది. తనకిప్పుడు సూటవ్వని విధంగా ఓవర్ మేకప్.. ఫ్యాషన్ డ్రెస్సులతో కనిపిస్తూ చాలాసార్లు ఇబ్బంది పెట్టింది శ్రీదేవి. ఐతే శ్రీదేవికి సంబంధించి తాజాగా బయటికి వచ్చిన ఫొటోలు మాత్రం ఇందుకు మినహాయింపు.

ఏం మాయ చేసేందో ఏమో కానీ.. ఈ కొత్త ఫొటోల్లో చాలా కొత్తగా కనిపిస్తోంది శ్రీదేవి. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నాళ్లలో ఉన్నట్లుగా కనిపిస్తోంది శ్రీదేవి ఇందులో. ఆమె రూపం అంతా 80ల నాటి లుక్ ను తలపిస్తోంది. బెంగళూరులో జరిగిన ఫ్యాషన్ కోసం రెడ్ డ్రెస్సులో అదిరిపోయేలా తయారై వచ్చింది శ్రీదేవి. మేకప్ కూడా తక్కువ వేసుకోవడం.. ఇంకోదో మేనేజ్ చేయడంతో ఒకప్పటి లావణ్యాన్ని గుర్తుకు తెచ్చేలా దర్శనమిచ్చింది శ్రీదేవి. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’.. ‘మామ్’ లాంటి మంచి సినిమాలు చేసిన శ్రీదేవి.. ఇప్పుడు కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె దృష్టంతా పెద్ద కూతురు జాన్వి తెరంగేట్రం మీదే ఉంది.sridevi4