తమన్నాకు శ్రీదేవి అవార్డ్

0మిల్కీబ్యూటీ తమన్నా దివంగత నటి శ్రీదేవి అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించనున్న ‘అప్సర అవార్డ్స్‌’ కార్యక్రమంలో ఇస్తారు ఈ విషయాన్ని తమన్నా వెల్లడించింది.

‘ఇండస్ట్రీలో నాకు స్ఫూర్తి శ్రీదేవినే. ఆమె పేరుతో ఉన్న అవార్డును అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె లాగే నేనూ చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చాను” అని చెప్పుకొచ్చింది.

కాగా ప్రస్తుతం తమన్నా ‘క్వీన్‌’, ‘నా నువ్వే’ చిత్రాలతో బిజీగా వుంది. నా నువ్వే’ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది., ఇందులో కళ్యాణ్ రామ్ హీరో.