పిట్ట కొంచెం.. ఎక్స్ పోజింగ్ ఘనం

0గతంలో హీరోయిన్లు కొంచెం సినిమా వాతావరణం వంట బట్టాక.. రెండు మూడు సినిమాలు చేశాక కానీ గ్లామర్ గేట్లు తెరిచేవాళ్లు కాదు. కానీ ఇప్పుడలా కాదు. హీరోయిన్లు కావాలనుకున్న అమ్మాయిలు తెరంగేట్రం చేయడాని కంటే ముందే గ్లామర్ విశ్వరూపం చూపించేస్తున్నారు. జాకీష్రాఫ్ తనయురాలు కృష్ణ ష్రాఫ్ ఆల్రెడీ సెమీ న్యూడ్ ఫొటో షూట్లతో ఎలా రెచ్చిపోయిందో చూశాం. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలికి సంబంధించిన హాట్ హాట్ ప్రైవేట్ ఫొటోలనూ కన్నాం. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా అప్పుడప్పుడూ ఇలాగే రెచ్చిపోతోంది. ఇక శ్రీదేవి తనయురాలు జాన్వి కనూర్ కూడా తాను మాత్రం ఏం తక్కువ తిన్నాను అంటోంది.

ఇప్పటికే కొన్నిసార్లు హాట్ హాట్ అవతారాల్లో కనిపించి మురిపించిన జాన్వి.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. స్వయంగా తన తల్లి బర్త్ డే పార్టీకి పిచ్చ హాట్ గా తయారై వచ్చి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. శ్రీదేవికి ఒకప్పుడు రెగ్యులర్ డిజైనర్ గా ఉన్న మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన టాప్ వేసుకుని ఈ పార్టీకి వచ్చింది జాన్వి. ముందు నుంచి చూస్తే ఇది మామూలుగా అనిపిస్తోంది కానీ.. దాని ప్రత్యేకత అంతా వెనుక వైపే ఉంది. వీపు మీద ఏ ఆచ్ఛాదనా లేనట్లు.. మొత్తం ఓపెన్ గా కనిపించేలా ఈ టాప్ డిజైన్ చేశారు. ఈ అవతారంలో జాన్విని చూసి ఔరా అనుకుంటున్నారంతా. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. తెరంగేట్రం చేశాక పరిస్థితి ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు జనాలు.Sridevi-daughter-Jhanvi-Kapoor-goes-Backless-at-her-mom-birthday-bash