ఫోన్ లో శ్రీదేవి చివరి మాటలు.. తీవ్ర జ్వరం

0మహానటి శ్రీదేవి దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం నిమిత్తం శ్రీదేవి తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఉన్న హోటల్‌లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించారు.

అయితే శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లకముందు జ్వరంతో బాధపడుతున్నారని ఆమె చిన్ననాటి స్నేహితురాలు, సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి చెప్పారు. ‘దుబాయ్‌కి వెళ్లకముందు శ్రీదేవి నాకు ఫోన్‌ చేసింది. అప్పటికే తాను జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పింది. యాంటీబయోటిక్స్‌ వాడుతోంది. దుబాయ్‌కి బయలుదేరడానికి ముందు అలసిపోయినట్లు ఉంది. ఇంత జ్వరంలో వెళ్లడం ఎందుకు అని అడిగాను. పెళ్లికి తప్పకుండా వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. ఆఖరికి మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది” అనిబాధపడ్డారు పింకీ.