సెక్సీ సుందరికి బంపర్ ఆఫర్స్

0Sridevi-hot-picఅందాల తార శ్రీదేవి.. ఈ మధ్య కొంతకాలంగా టాప్ ట్రెండింగ్ లోనే ఉంటోంది. దీనికి కారణం.. పెద్ద కూతురు జాన్వి కపూర్ కి సంబంధించిన న్యూస్. అరంగేట్రం నుంచి స్టైలింగ్ వరకు.. బాయ్ ఫ్రెండ్స్ నుంచి రిలేషన్స్ వరకూ చాలారకాల న్యూస్ వస్తున్నాయి. మరోవైపు శ్రీదేవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మామ్’ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

శ్రీదేవి రీఎంట్రీ సాఫీగానే జరిగింది. ఇంగ్లీష్-వింగ్లిష్ అంటూ ఆకట్టుకున్నాక.. కోలీవుడ్ మూవీ పులితో ఎదురుదెబ్బ తగిలింది. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న శ్రీదేవి.. ఇప్పుడు మామ్ ను దాదాపు ఫినిష్ చేసేసింది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన మార్కెటింగ్ కబుర్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మామ్ మూవీకి శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి దక్కించుకుంది ఓ ప్రముఖ మీడియా సంస్థ. దీంతో పాటు ఓ బోనస్ కూడా ఉంది. మామ్ కనుక థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలో ఓ ఫిగర్ ను అధిగమిస్తే.. మరింత మొత్తం చెల్లిస్తామని కూడా చెప్పారట.

వీటితో పాటు బోనీకపూర్ కి దక్కిన మరో బంపరాఫర్ ఏంటంటే.. తమ గ్రూప్ నకు చెందిన ఎంటర్టెయిన్మెంట్ ఛానల్ లో.. అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా కూడా స్థానం కల్పించారట. సినిమాల నిర్మాణ భాగస్వామ్యం కోసం.. బోనీకపూర్ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సినిమాతో ఇన్నేసి బంపర్ ఆఫర్లను భర్తకు ఇవ్వడం అంటే.. అది కేవలం శ్రీదేవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ కదూ.