బ్రేక్ తీసుకోవాలని లేదట.. నమ్మాలా శ్రీదేవి??

0


Sridevi-On-About-her-Retireఇప్పుడు శ్రీదేవి రోజూ మీడియా ముందుకు వస్తోంది. మామూలుగా అయితే కెమెరాలను చూస్తేనే ఈమెకు చిర్రెత్తుకొస్తుంది కాని.. ఈ వారం తన సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి ఇప్పుడు అమ్మడికి మీడియాలో ప్రచారం బాగా కావాలిగా.. అందుకే రోజూ చాలా హడావుడి చేస్తోంది. అయితే ఈ సందర్భంగా శ్రీదేవి చెబుతున్న మాటలకు మాత్రం నవ్వొస్తోందనే చెప్పాలి. అసలు నమ్మశక్యంగానే లేవు.

అసలు వయస్సు 50 దాటినా కూడా ఇంకా గ్లామరస్ గా హీరోయిన్ రోల్స్ చేయాలి అనేంతలా కలరింగ్ ఇచ్చే శ్రీదేవి ఇప్పుడు ”మామ్” సినిమాతో వస్తోంది. ఈ సినిమా గురించి చెబుతూ.. నేనసలు ఎప్పుడూ కూడా సినిమాల నుండి దూరం అవ్వాలి బ్రేక్ తీసుకోవాలి అని అనుకోలేదు. ఎప్పుడూ నాకు రిటైర్మెంట్ అనే ఫీలింగే రాలేదు.. అంటూ సెలవిచ్చింది. నిజానికి అప్పట్లో శ్రీదేవి పెళ్ళయ్యాక సినిమాలు మానేసింది. ఆ తరువాత ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక టివి సీరియల్స్ కూడా చేసింది. కాని రూమర్స్ ఏంటంటే.. బోని కపూర్ వరుసగా సినిమాలన్నీ తీసి ఫ్లాపులు కొడటంతో.. మళ్లీ అమ్మడు సినిమాలూ అవీ ఇవీ అంటూ మొదలెట్టేసిందని. చివరకు ప్రొడక్షన్ హ్యాండిల్ చేసి బాగా ఫెయిలైన శ్రీదేవి.. చివరకు యాక్టింగ్ అయితేనే పైసా పెట్టకుండా డబ్బులు సంపాదించొచ్చని ఇటొచ్చిందనేది క్రిటిక్స్ మాట. కాని ఈమె మాత్రం.. అబ్బే నాకు బ్రేక్ తీసుకోవాలి అనిపించలేదు అంటోంది.

ఏమోగాని.. మామ్ సినిమాతో శ్రీదేవి హిట్టు కొడితే మాత్రం.. ఇక మరోసారి ఆమె సినిమాలపై తన హవా చాటినట్లే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే శ్రీదేవి మెంటాల్టీ అండ్ మాటలు ఎలా ఉన్నప్పటికీ.. నటనపరంగా ఆమెకు 100కు 100 మార్కులు ఎప్పుడూ పడతాయిలే.