శ్రీకాంత్ రారా చిత్రం విడుదలకు సిద్ధం

0srikanth-rara-teaserఅనుష్క భాగమతిగా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయినట్టుగా వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. వెరైటీ ట్విస్టులతో కొత్త తరహా కథనంతో దర్శకుడు అశోక్ నడిపించిన తీరు ఫైనల్ గా మంచి రిజల్ట్ ఇచ్చేలా ఉంది. ఆ మధ్య ఒకే తరహా రొటీన్ హారర్ సినిమాలు వస్తున్నాయి అనే కామెంట్ బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో కొంతకాలం వీటికి ఆదరణ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు భాగమతి విజయంతో ఒక్కొక్కటి బయటికి వచ్చేలా ఉన్నాయి. అందులో భాగంగా శ్రీకాంత్ చేసిన రారా అనే సినిమా విడుదలకు సిద్ధమయ్యింది శ్రీకాంత్ ఒక పూర్తి హారర్ జానర్ మూవీలో నటించడం ఇదే మొదటిసారి. నాజియా హీరొయిన్ గా నటించిన ఈ మూవీకి శంకర్ దర్శకుడు. షూటింగ్ ఏనాడో పూర్తి చేసుకున్న రారా రిలీజ్ కు ఇప్పుడు రూట్ క్లియర్ చేస్తున్నారు.

ట్రైలర్ చూస్తే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో లెక్కలేనన్ని సార్లు చూసిన ఫార్ములానే ఇందులో కూడా మళ్ళి వాడారు. ఒక భూత్ బంగాళా అందులో ఒక దెయ్యం హీరోతా సహా బ్యాచ్ మొత్తం అందులో ఇరుక్కోవడం కామెడీ థ్రిల్ అన్ని కలగలసి ఇంతకు ముందు చూసిన ఫీలింగే కలిగిస్తోంది. టేకింగ్ లో ఏదైనా వైవిధ్యం చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసారేమో చూడాలి. భాగమతి సక్సెస్ లో ఈ అంశం కన్నా అనుష్క నటన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిర్మాణ విలువలు విజయానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఇది అన్నింటికీ వర్తించాలని లేదు కాబట్టి రారా లో మరీ కొత్తగా అనిపించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప మెప్పించడం కష్టం.

సోలో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుని కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీకాంత్ ఆ మద్య యుద్ధం శరణంతో విలన్ గా మారాడు కాని అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. సరైనోడు లాంటి మూవీస్ లో చేసిన సపోర్టింగ్ రోల్స్ మాత్రం మంచి పేరు తీసుకొచ్చాయి. అప్పుడెప్పుడో షూటింగ్ చేసేసుకున్న ఈ రారాతో పాటు ఆపరేషన్ 2019 అనే మరో సినిమా కూడా లైన్ లో ఉంది. ఒకవేళ ఇవి హిట్ అయితే శ్రీకాంత్ మళ్ళి హీరోగా కం బ్యాక్ అంటాడేమో చూడాలి.