ఆ మూవీ కోసం 7 సినిమాలకు హీరోయిన్ నో..!

0

కన్నడ సినీ పరిశ్రమలో సంచలన చిత్రంగా నిలిచిన కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అంతకు ముందు వరకు కన్నడ సినిమా వసూళ్లను కేజీఎఫ్ సినిమా వసూళ్లను చూస్తే పొంతన లేకుండా ఉంది. కన్నడ రికార్డు బ్రేకింగ్ చిత్రం కలెక్షన్స్ కంటే కేజీఎఫ్ చిత్రానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రెట్ల వసూళ్లు అధికంగా నమోదు అయ్యాయి అంటే కేజీఎఫ్ ఏ స్థాయి సక్సెస్ ను మోదు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. కేజీఎఫ్ సంచలన విజయంతో యష్ ఒక్కసారిగా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

యష్ కు మాత్రమే కాకుండా కేజీఎఫ్ లో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె కనిపించింది అడపా దడపా సీన్స్ లో అయినా కూడా స్టార్ డంను దక్కించుకుంది. కేజీఎఫ్ విడుదలైన వెంటనే శ్రీనిధికి కన్నడ తెలుగు తమిళ భాషల్లో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయట. ఆ మొత్తం ఆఫర్లను కూడా తిరష్కరించింది. కారణం ‘కేజీఎఫ్ 2’ కోసం. మొదటి పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 అంటూ సీక్వెల్ ను మొదలు పెట్టారు. మొదటి పార్ట్ కు రెట్టింపు ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అంతటి భారీ చిత్రం అవ్వడం వల్లనే ఎప్పుడంటే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది.

కేజీఎఫ్ 2 కు ఎప్పుడు డేట్లు అవసరం అవుతాయో తెలియదు కనుక ఏడు ఆఫర్లను కూడా తిరష్కరించింది. కేజీఎఫ్ 2 తర్వాత ఖచ్చితంగా మళ్లీ పలు ఆఫర్లు వస్తాయి. ఇప్పుడే వాటి గురించి ఆలోచించి కేజీఎఫ్ 2 ఆఫర్ ను మిస్ చేసుకోవడం ఎందుకు అనుకుందో ఏమో కాని శ్రీనిధి అన్ని భాషల సినిమాలకు నో చెప్పేసింది. కేజీఎఫ్ 2 లో అయినా ఈమె పాత్ర ఎక్కువ ఉంటుందో చూడాలి.
Please Read Disclaimer