ఎన్టీఆర్ తో ఫొటో.. అందుకే తీసుకున్నా..

0కమెడియన్ పాత్రలు చేస్తూనే మంచి కథలు వస్తే హీరోగానూ ట్రే చేస్తున్నారు నటుడు శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘జంబలకిడి పంబ’ చిత్రం విడుదల కాబోతోంది. దాంతోపాటు త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా అరవింద సమేతలో కూడా శ్రీనివాసరెడ్డి నటిస్తున్నారు. అలాగే శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న అమర్ అక్బర్ అంటోనీ – వెంకటేశ్-వరుణ్ తేజ్ సినిమా – నారా రోహిత్ ‘వీరభోగ వసంత రాయలు’ – పంతం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ చిత్రం ‘జంబలకిడి పంబ’ ప్రమోషన్ లో శ్రీనివాసరెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

జంబలకిడి పంబ పాత సినిమాలో ఊరంతా ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు ఆడవాళ్లుగా మారితే ఈ సినిమాతో తాను – హీరోయిన్ మాత్రమే ఆడ – మగగా తారుమారు అవుతామని అన్నారు. ఈ సినిమాలో మహిళల వేషం వేశాక తనకు ఆడవారిపై గౌరవం పెరిగిందని.. మహిళల రుతుస్రావం సమస్యను ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించి మేలుకొలుపామని అన్నారు.

ఇక తనకూ ఎన్టీఆర్ కు విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై శ్రీనివాస్ రెడ్డి సంచలన నిజాలు చెప్పారు. ఆ వార్తలు చూసినప్పుడు బాధ కలుగుతుందని అన్నారు. మా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పడానికే ఇటీవల షూటింగ్ లో ఎన్టీఆర్ – తాను – త్రివిక్రమ్ తో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టానని వివరించారు. ఎన్టీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

‘ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఏదో అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను అన్నాను. దానికి చిలువలు పలువలు చేసి వక్రీకరించారు. కానీ ఎన్టీఆర్ ఎంతో పరిణతి చెందిన వ్యక్తి. దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా నన్ను అస్సలు పట్టించుకోరు.. ఆయనకు ఇలాంటి ఆలోచించే తీరికే లేదు. అలాంటి వార్తలు వచ్చినప్పుడు బాదేసింది’ అంటూ శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్టీఆర్ తో విభేదాలపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.