శ్రీనూలో ఎందుకంత టెన్షన్?

0

మాస్ మహారాజా రవితేజ – శ్రీను వైట్ల స్నేహం గురించి తెలిసిందే. `నీకోసం` సినిమాతో ఆ ఇద్దరి జర్నీ మొదలైంది. ఈ కాంబినేషన్ సినిమాలు నీకోసం – వెంకీ – దుబాయ్ శ్రీను బ్లాక్బస్టర్లు విజయాలు అందుకున్నాయి. కెరీర్ ఆరంభం నుంచి ఆ ఇద్దరి మధ్యా స్నేహం – ర్యాపో వల్లనే ఈ విజయాలు దక్కాయి. ఆ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్న చందంగా కలిసి పని చేశారు. అయితే అనూహ్యంగా వైట్ల కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడంతో హీరోలంతా ముఖం చాటేసిన క్రమంలో మరోసారి రవితేజనే అతడికి లిఫ్ట్ ఇవ్వడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ జోడీ నుంచి వస్తున్న సినిమాగా `అమర్ అక్బర్ ఆంటోని` హాట్ డిబేట్. ఒక ఫ్లాప్ దర్శకుడికి రవితేజ అవకాశం ఇచ్చారు.. శ్రీనూ ఈసారైనా నిలబెడతాడా.. లేదా? అన్న ఉత్కంఠ పరిశ్రమలో నెలకొంది. మరోవైపు మాస్ మహారాజా అభిమానుల్ని ఇది టెన్షన్ పెడుతోంది. మొత్తానికి అమర్ అక్బర్ ఆంటోని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజవుతోంది.

ఇప్పటికే పోస్టర్లు – మేకింగ్ వీడియోలు ఆసక్తిని పెంచాయి. మరోసారి శ్రీనూ మార్క్ కనిపిస్తున్నా ఈసారి కథ పరంగా వైవిధ్యంగానే వెళ్లాడని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కెరీర్ లో ఎంతో కీలకమైన సినిమా ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ప్రస్తుతం మాస్ రాజాని – శ్రీను వైట్ల ని నిలవనివ్వడం లేదనడానికి నేటి ప్రీరిలీజ్ వేడుకనే సాక్ష్యం. ఈ వేడుకలో శ్రీనూ పూర్తిగా టెన్షన్ తో కనిపించడం.. అతడి మాటలు కాస్త తడబడడం వేదిక వద్ద హాట్ టాపిక్ గా మారాయి.

శ్రీను వైట్ల మాట్లాడుతూ -“ఎనిమిది నెలల పాటు స్క్రిప్టుకే కేటాయించి పని చేశాం. ప్రయాణం బావుంటే విజయం దక్కుతుందనేది నా నమ్మకం. ఈ ప్రయాణం బావుంది. రవితేజ అన్నివేళలా నా ట్రబుల్ షూటర్. నేనెప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనే ఎనర్జీ ఇచ్చి బయటకు తీసుకొస్తుంటాడు.. వెంకీ – దుబాయ్ శ్రీను టైమ్ లోనూ అలానే ఆదుకున్నాడు. ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోని అవకాశం అలానే ఇచ్చాడు. తను ఇచ్చిన ఎనర్జీ సపోర్టు తోనే సినిమా చేశాను. అనుకున్నది తీయగలగడానికి నిర్మాతల సాయం కలిసొచ్చింది..“ అంటూ కృతజ్ఞతను తెలిపారు. నేను తీసిన సినిమాల్లో లగ్జరీగా తీసిన సినిమా ఇదని అన్నారు. వెంకట్ సి కెమెరా – తమన్ సంగీతం .. అన్ బిలీవబుట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడని శ్రీనూ తెలిపారు.
Please Read Disclaimer