వైరల్ గా మారిన శ్రీయ పెళ్లి..

0ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇంకా తన హావ కొనసాగిస్తోంది శ్రీయ. అగ్ర హీరోలతో పాటు యాంగ్ హీరోలతో జోడి కట్టి సక్సెస్ లు సాధించిన ఈ బ్యూటీ తాజాగా పెళ్లి చేసుకుందనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారింది. తన బాయ్ ఫ్రెండ్ శ్రీయ ను రహస్యంగా వివాహం చేసుకున్నటు సమాచారం.

గతంలో ఉదయ్ పూర్లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం శ్రియ పెళ్లి ముంబైలోని అంధేరీలో ఉన్న తన ఇంట్లోనే మార్చి 12న రష్యన్ అబ్బాయి ఆండ్రీ కోస్ చీవ్ ని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. ఈ వివాహ తంతుకు శ్రియ తరుపు బంధువులు… ఆండ్రీ తరపు బంధువులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. సినిమా ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్ పేయ్ అతని భార్య షబానా వచ్చారని అంటున్నారు.

ఈ వివాహ వేడుకలో శ్రీయ గులాబీ రంగు చీరలో మెరిసిందట. మార్చి 11న శ్రియ ఆండ్రీల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారట.