బాయ్‌ఫ్రెండ్‌తో శృతిహాసన్‌ కటీఫ్‌

0Sruthi-talks-about-her-relaఓ విదేశీయుడితో శృతిహాసన్‌ ప్రేమలో పడిందని, అతనితో సహ జీవనం చేస్తోందని ఆమధ్య గాసిప్స్‌ వినిపించాయి. అతడిని పెళ్లాడే ఉద్దేశంతోనే కెరియర్‌పై ఫోకస్‌ తగ్గించిందని, ఫిట్‌నెస్‌ గురించి కూడా శ్రద్ధ తీసుకోలేదని టాక్‌ వచ్చింది. ప్రేమమ్‌, కాటమరాయుడు చిత్రాల్లో శృతి అలా కనిపించడానికి కూడా కారణమిదేనని చెప్పుకున్నారు.

అయితే తనపై వచ్చిన విమర్శలతో అలర్ట్‌ అయిన శృతి మళ్లీ కెరియర్‌ని సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా బౌన్స్‌ బ్యాక్‌ అవడానికి తమిళంలో చేస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం కోసం కత్తి సాము నేర్చుకుంటోంది. యుద్ధ విద్యలు కూడా అభ్యసిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో తెగతెంపులు చేసుకుందని, గతంలో కూడా తన కెరియర్‌కి ఇబ్బంది కలిగించిన రిలేషన్స్‌ని శృతి దూరంగా పెట్టిందని అంటున్నారు. ఆమె కూడా తనకి కెరియర్‌, రిలేషన్‌షిప్‌ బ్యాలెన్స్‌ చేయడం రావడం లేదని అంగీకరించింది. అతని కెరియర్‌, పనితో పాటు తన కెరియర్‌ని, పేరుని కూడా గుర్తించి, అందుకు తగ్గట్టుగా నడుచుకునేవాడు దొరికే వరకు ఇక రిలేషన్స్‌ జోలికి వెళ్లనని శృతి పేర్కొంది. తిరిగి కెరియర్‌పై ఫోకస్‌ పెట్టింది కనుక శృతి నుంచి మళ్లీ బ్లాక్‌బస్టర్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చునిక. అలాగే తన గ్లామర్‌, స్టయిలింగ్‌ గురించి కామెంట్‌ చేసిన వాళ్లకి కూడా శృతి గట్టిగానే బదులివ్వనుంది.