నేరుగా రమ్మని పిలవడం దారుణం : శృతి

0Sruthi-Hariharanసినిమా ఇండస్ట్రికి మాయని మచ్చలా మారిన కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఒక కన్నడ నటి వలన. హీరోయిన్ గా అవకాశాలు కావాలంటే వాళ్ళ శరీరం తాకట్టు పెట్టకతప్పదని మనం ఎక్కడో ఒక చోట వింటూ ఉంటాం. ఇది ఒక్క మన సినిమాకు పట్టిన గ్రహణం మాత్రమే కాదు దేశంలో ఉన్న అన్నీ సినిమా ఇండస్ట్రిలను పట్టి పీడుస్తున్న సమస్య ఇది. ఒకరి ఆశయం మరొకరు అవకాశంగా తీసుకొని ఇలాంటి రోతకు కారణం అవుతూ వస్తుంది. ఆ మధ్య బాలీవుడ్ లో కూడా ఒక డైరెక్టర్ పై ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణ వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఒక కన్నడ నటి శృతి హరిహరన్ చేసిన తాజా కామెంట్ తో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఒక్క కన్నడ ఇండస్ట్రి నే కాదు తెలుగు ఇండస్ట్రి పై కూడా విమర్శలు చేసింది. శృతి హరిహరన్ అసలు ఏమి అన్నది అంటే “కాస్టింగ్ కౌచ్ వలన ఒకటి రెండు అవకాశాలు వస్తాయి కానీ టాలెంట్ ఉంటేనే ఇక్కడ హీరోయిన్ గా కొనసాగుతాము. కొంతమంది ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నేరుగా రమ్మని పిలవడం కోరికలను తీర్చమని అడగటం ధారుణంగా ఉందిని చెప్పింది. తెలుగు – కన్నడ ఇండస్ట్రి లో అయితే ఇది మరి ఎక్కువగా ఉందని చెప్పింది. ముఖ్యంగా చిన్న సినిమా హీరోయిన్ లు ఈ విషయంలో ఇబ్బందిపడుతున్నారు” అని చెప్పింది.

అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్న ఓ కన్నడ రియాలిటీ షోలో ఒక మీడియా ఇంటర్వ్యూ లో శృతి హరిహరన్ ఈ వివాదాన్ని లేవదీసింది. శృతి హరిహరన్ కన్నడ హిట్ ఫిల్మ్ ‘లుసియా’ లో నటించింది. అలానే చాలా మలయాళం సినిమాలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘సోలో’ సినిమాలో కూడా లీడ్ హీరోయిన్ రోల్ చేస్తుంది. ఒక్క అవకాశం కోసం అలా చేయవద్దు మీ టాలెంట్ ని నమ్ముకోండి. అదే మీ కెరియర్ణి మారుస్తుంది అని కొత్త హీరోయిన్లు కు సలహా కూడా ఇచ్చింది.